రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఇప్పుడు ఆ సేవలు అన్ని స్టేషన్లలో ప్రారంభించారట.. వివరాలు ఇవిగో..

Railway Passengers: కరోనా మహమ్మారి వల్ల రైల్వే వ్యవస్థకు ఎంతో నష్టం చేకూరింది. కొన్ని నెలల పాటు పలు రైళ్ల రాకపోకలను ప్రభుత్వం నిషేధించింది. కాగా వ్యాక్సిన్

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఇప్పుడు ఆ సేవలు అన్ని స్టేషన్లలో ప్రారంభించారట.. వివరాలు ఇవిగో..
Follow us

|

Updated on: Feb 22, 2021 | 5:56 AM

Railway Passengers: కరోనా మహమ్మారి వల్ల రైల్వే వ్యవస్థకు ఎంతో నష్టం చేకూరింది. కొన్ని నెలల పాటు పలు రైళ్ల రాకపోకలను ప్రభుత్వం నిషేధించింది. కాగా వ్యాక్సిన్ రావడంతో ఇప్పడిప్పుడే అన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. తాజాగా రైల్వే అధికారులు ప్రయాణికులు శుభవార్త తెలిపారు. కొవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్‌కి పరిమితమైన రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థ ఇప్పుడు అన్ని స్టేషన్లలో ఆఫ్‌లైన్లలో కొనసాగుతుందని ప్రకటించారు.

ప్రధానంగా కరెంట్ టికెట్ బుకింగ్ ప్రక్రియను అన్ని డివిజన్లలో దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. అంటే రిజర్వేషన్ కానివారు నేరుగా స్టేషన్‌కి వెళ్తే మిగులు సీట్ల మేరకు బెర్త్ దక్కే అవకాశముందని తెలిపారు. గతంలోనూ ఈ విధానం ఉన్నా.. కొవిడ్ కారణంగా ఆన్‌లైన్ టికెటింగ్‌నే అనుమతించారు. అయితే తాజాగా ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

రేషన్‌ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై ముంగిట్లోకే సరుకులు.. త్వరలో రేషన్ రైస్‌ ఏటీఎం ఏర్పాటు!