రేషన్‌ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై ముంగిట్లోకే సరుకులు.. త్వరలో రేషన్ రైస్‌ ఏటీఎం ఏర్పాటు!

రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం వినూత్నం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది.

రేషన్‌ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై ముంగిట్లోకే సరుకులు.. త్వరలో రేషన్ రైస్‌ ఏటీఎం ఏర్పాటు!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 21, 2021 | 8:59 PM

Rice ATMs in five cities : రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం వినూత్నం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అయితే కొత్త ఏడాది నుంచి ఈ స్కీమ్‌ మరింత కొత్తగా కనిపించనుంది. రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి కేంద్రం రెడీ అవుతోంది. కిలో మీటర్ల మేర క్యూ లైన్‌లో నిల్చుని రేషన్ సరుకులు తీసుకునే పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు ఫ్లాన్ చేసింది. ఇందుకోసం ఏటీఎంల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటామో..అలాగే..రైస్ తీసుకోవచ్చు. త్వరలోనే రేషన్ బియ్యం, గోధుమలను పొందేలా ఆటోమెటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు.

పేద ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లకుండానే ఈ మిషన్లను ద్వారా సరుకులను పొందే అవకాశం తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేషన్ షాపుల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా బియ్యం, గోధుమలు తీసుకోవచ్చని కేంద్ర భావిస్తోంది.

ఇక, రైస్ ఏటీఎంలు. బియ్యం, గోధుమలను స్థానిక అవసరాలకు అనుగుణంగా..ఆ రాష్ట్రంలోనే సేకరిస్తే…రవాణా ఖర్చు తగ్గుతుందని పాండే తెలిపారు. కాలం చెల్లిన గోదాముల స్థానంలో ఉక్కు గాదెల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రేషన్ సరుకులు పొందుతున్న దాదాపు 81 కోట్ల మందికి కొత్త రేషన్ కార్డులు లభించనున్నాయి. రానున్న రోజుల్లో ఏటీఎం కార్డును పోలిన విధంగా ఉంటే స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారులకు చేరనున్నాయి.

ఇదీ చదవండి… Lockdown: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్‌ అమలు..

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..