ముంబైలో దారుణ ఘటన.. పెళ్లికి నిరాకరించిందని యువతిని రైలు కింద తోసేందుకు యత్నం.. యువకుడి అరెస్ట్..
Lover Attempts woman: పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిని రైలు కిందకు నెట్టేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ముంబైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా
Lover Attempts woman: పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిని రైలు కిందకు నెట్టేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ముంబైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడాలా నివాసి సుమేథి జాదవ్, యువతి గతంలో ఒకే చోట పనిచేసినప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే, జాదవ్ మద్యానికి బానిసయ్యాడని తెలుసుకున్న యువతి అతడ్ని దూరం పెట్టింది.
అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని యువతిని అతడు వేధించడం మొదలుపెట్టాడు. అంథేరిలో యువతి రైలు ఎక్కగా ..జాదవ్ ఆమెను వెంబడించాడు. యువతి తల్లికి ఫోన్ చేయగా ఆమె కార్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. మరోసారి యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జాదవ్ లోకల్ రైలు వచ్చే సమయంలో ఆమెను రైలుకిందకు తోసేందుకు ప్రయత్నించాడు. యువతి, ఆమె తల్లి తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో యువతి తలకు గాయమైంది. వెంటనే జాదవ్ అక్కడి నుంచి పరారయ్యాడు.యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు జాదవ్‌ను అరెస్టు చేశారు.
Watch: ‘Spurned’ 24-year-old man attempts to push woman under running train in Khar. #Mumbai pic.twitter.com/QJwnvWk8rw
— TOI Mumbai (@TOIMumbai) February 21, 2021
Raviteja: ఫుల్ జోష్ మీదున్న మాస్ మహారాజ.. వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకెళుతోన్న రవితేజ..