Man Cheats Woman: నగరంలో నయవంచన.. ప్రేమ పేరుతో బీకాం విద్యార్థినికి ఎర.. అవసరం తీరాక వద్దు పో అంటున్న మాయగాడు..
Man Cheats Woman: ప్రేమంటూ వెంటపడి, మాయమాటలు చెప్పి..పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వివాహం చేసుకుందామంటే ముఖం చాటేశాడో యువకుడు.
Man Cheats Woman: ప్రేమంటూ వెంటపడి, మాయమాటలు చెప్పి..పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వివాహం చేసుకుందామంటే ముఖం చాటేశాడో యువకుడు. హైదరాబాద్‌లోని కార్మికనగర్లో నివాసముండే బీకాం విద్యార్థినిని అదే ప్రాంతంలో నివసించే రాజు అనే యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఒకటయ్యారు.
వివాహం గురించి ప్రస్తావించినప్పుడు దాటవేస్తూ వచ్చాడు. దీంతో బాధిత యువతికి కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయం చేసి పెళ్లికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో రాజు వరుడికి ఫోన్ చేసి సదరు యువతితో తాను ప్రేమాయణం సాగిస్తున్నానని, తానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో పెళ్లి చెడిపోయింది. సదరు యువతి తనను పెళ్లి చేసుకోమని ఇటీవల కోరగా.. ‘పెళ్లి లేదు, ఏమీ లేదు.. పో!’ అంటూ యువతిని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో తాను మోసపోయానని భావించిన సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రాజు అనే యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మాట్లాడాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు.. కత్తితో పొడిచి చంపేశారు.. శామీర్‌పేట్‌లో మేస్త్రీ దారుణహత్య