AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమాయకురాలిని, బొగ్గు కేసులో నన్నెందుకు విచారిస్తున్నారో కారణం తెలియలేదు, రుజిరా బెనర్జీ.

బొగ్గు స్మగ్లింగ్ కేసుతో తనకు సంబంధం లేదని, సీబీఐ అధికారులు తననెందుకు విచారిస్తున్నారో తెలియదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ అన్నారు.

అమాయకురాలిని, బొగ్గు కేసులో నన్నెందుకు విచారిస్తున్నారో కారణం తెలియలేదు, రుజిరా బెనర్జీ.
Umakanth Rao
|

Updated on: Feb 22, 2021 | 2:05 PM

Share

బొగ్గు స్మగ్లింగ్ కేసుతో తనకు సంబంధం లేదని, సీబీఐ అధికారులు తననెందుకు విచారిస్తున్నారో తెలియదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ అన్నారు. అసలు ఇందుకు కారణమే తనకు తెలియదన్నారు. ఇన్వెస్టిగేషన్ కోసం ఈ నెల 23 న ఉదయం 11 మధ్యాహ్నం 3 గంటల మధ్య మీరు మా ఇంటికి రావచ్ఛునని ఆమె వారికి రాసిన ఓ లేఖలో పేర్కొంది. మీ షెడ్యూల్ గురించి తెలియజేయాలని కూడా ఆమె కోరింది. చట్టం పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని రుజిరా బెనర్జీ తెలిపింది. బొగ్గు కేసులో అభిషేక్ బెనర్జీ వదిన మేనకా గంభీర్ కి కూడా సీబీఐ సమన్లు జారీ చేయడం విశేషం. సమన్లు అందజేసేందుకు ఈ దర్యాప్తు సంస్థ అధికారులు నిన్న దక్షిణ కోల్ కతా లోని ఈమె ఇంటికి వెళ్ళినప్పుడు తన ఇంట్లోనే ఉంది.

ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ కి చెందిన కనుస్టోరియా, కజోరియా బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు అక్రమ తవ్వకాలు, చోరీకి సంబంధించి రుజిరా సహా మరికొందరిపై సీబీఐ గత నవంబరులో కేసు దాఖలు చేసింది. రుజిరా, మేనకా గంభీర్ ల బ్యాంకు ఖాతాలకు కొంత సొమ్ము బదలాయింపులు జరిగాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం  ప్రధాన కార్యదర్శి వినయ్ మిశ్రా ద్వారా ఈ సొమ్ము ట్రాన్స్ ఫర్లు జరిగాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు.

ఇలా ఉండగా సీఎం మమతా బెనర్జీ నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బెంగాలీల వెన్ను ఎలా వంచాలో తమకు తెలుసునని ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది అంటున్నారని, గతంలో వారు ఆలా చేశారని, ఇప్పుడు కూడా ఆ ఇందుకు యత్నిస్తున్నారని అన్నారు. వారిని అలాగే చేయనివ్వండి.. మేం భయపడబోం.. జైలు బూచి చూపి మమ్మల్ని బెదరించవద్దు అని ఆమె అన్నారు. పిల్లులు, ఎలుకలకు తాము భయపడే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. యోధురాలిగా ఎలా పోరాడాలో తనకు తెలుసునని, ఈ విధమైన చర్యలకు భయపడబోమని అన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

అందంగా ఉందని యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు : women dismissed from job due to her beauty video