జంగిలిగొండ గుట్టల్లో వింత ఆకారం.. ఊరిని వణికిస్తున్న దెయ్యం భయం.. వైరల్‌గా మారిన వీడియో..!

దెయ్యం..భయం ఆ ఊరి ప్రజలను వెంటాడుతోంది. రాత్రి వేళ దెయ్యం సంచరిస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి..దెయ్యం రూపం కనిపిస్తుందని ప్రచారం జోరందుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 11:12 am, Mon, 22 February 21

Mahbubabad devil : దెయ్యం..భయం ఆ ఊరి ప్రజలను వెంటాడుతోంది. రాత్రి వేళ దెయ్యం సంచరిస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి..దెయ్యం రూపం కనిపిస్తుందని ప్రచారం జోరందుకుంది. ఇరుగుపొరగు గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దెయ్యం ఎంచేస్తుందోనన్న భయంతో రెయింబవళ్లు కాపాలా కాస్తున్నారు అక్కడి జనం. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ, రోదసిలోకి దూసుకెళ్తున్న ఈ కాలంలో దెయ్యాల గోలేంటి. ఇదంతా ఫాల్స్ ప్రచారం అంటూ కొంతమంది కొట్టి పడేస్తున్నారు. అసలు నిజంగా దెయ్యం సంచరిస్తుందా గ్రామస్థులు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది.

దెయ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఇదుగో ఇదే దెయ్యం.. ఇది చూసి జనం కునుకు తీయడం మానేశారు.. మెతుకు మింగడం మరిచిపోయారు. చిమ్మని చీకట్లో తెల్లని అవతారం.. నడుస్తూనే కూర్చుంటోంది.. కూర్చున్న వెంటనే నిలబడుతోంది. స్లో మోషన్‌లో అటు ఇటూ తచ్చాడుతోంది. ఈ అవతారమే మహబూబాబాద్‌ జిల్లాలోని జంగిలిగొండ గ్రామస్తుల్ని జడిపించేలా చేస్తోంది. ఇంతకీ ఇది దెయ్యమా..? లేదంటే ఆ పేరుతో జరుగుతున్న ప్రచారమా..? నిజమేంటో తెలియదు. కానీ దెయ్యం దెబ్బకు జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు.

తెల్లని వస్త్రాలతో ఒళ్లంతా కప్పుకుని ఎవరో వెళ్తున్నట్టు ఉన్న ఈ వీడియో వైరల్ అయింది. కొద్దిరోజులుగా వాట్సప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో జంగిలిగొండు వాసుల్లో తెలియని భయం అలుముకుంది. మా ఊరికి దెయ్యం వచ్చి పోతుందని హడలిపోతున్నారు. ఊరు పక్కనే గుట్టలు ఉండటం.. ఆ గుట్టల్లోంచి అర్థరాత్రి సమయంలో దెయ్యం వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో సాయంత్రం ఆరు అయిందంటే చాలూ.. జనం గూటికి చేరిపోతున్నారు. లేదంటే ఎక్కడ తమను దెయ్యం వెంటాడుతుందోనని వణికిపోతున్నారు.

ఇది నిజంగా దెయ్యమేనా? ఆ మాటదేవుడెరుగు. కానీ భయంతోనే జనం సగం చచ్చిపోతున్నారు. అధికారులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంతో నిగ్గుతేల్చాలని వేడుకుంటున్నారు. కొందరు మాత్రం ఇది కావాలనే చేసిన ఫ్రాంక్ వీడియో అని కొట్టిపడేస్తున్నారు. జనాన్ని భయపెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ దెయ్యం ప్రచారం దెబ్బకి జనం గుండెలు బాదుకుంటున్నారు.

అది ఆకతాయిల పనో లేక నిజమో కానీ.. ఓ వింత సంఘటన ఆ ఊరి ప్రజలకు కునుకు లేకుండా చేస్తుంది… చీకటిపడితే చాలా దెయ్యం భయంతో ఊరంతా ఉల్లిక్కి పడుతున్నారు.. ఏ చిన్న శబ్దం వినబడినా దెయ్యం వచ్చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఆకతాయిలు సృష్టించిన వీడియోలా మిస్టరిని చేధించి గ్రామంలో నెలకొన్న భయాన్ని తొలగించచాలని గ్రామ సర్పంచ్ తో సహా ఊరి ప్రజలంతా కోరుతున్నారు..