ప్రభుత్వ సబ్సిడీ లోన్‌కు అప్లై చేశారా..? అయితే మీకు ఈ విషయం తెలుసా.. అత్యధికంగా ఈ కేటగిరీకే దరఖాస్తులు వచ్చాయట!
Sc Corporation Loans 2020-21: స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న
Sc Corporation Loans 2020-21: స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న యువత తమ కాళ్ల మీద తా ము నిలబడేందుకు సర్కార్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా అర్హులైన యువతీ, యువకుల నుంచి సబ్సిడీ రుణా ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.
ఎస్సీ కార్పొరేషన్ 43 క్యాటగిరీల కింద సబ్సిడీపై రుణాలు అందిస్తున్నది.ఎస్సీ వర్గాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తు తుది గడువును నాలుగు పర్యాయాలు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 1,73,830 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా వాహనాల కొనుగోలు (కమర్షియల్, పాసింజర్ కార్లు, ఆటో రిక్షాలు)పై యువత ఆసక్తి చూపింది. ప్రయాణికుల వాహనాల కోసం 27,582 మంది, గ్రామీణ ప్రాంతాల్లో గూడ్స్ క్యారియర్ల కోసం 2,352 మంది, ఆటోరిక్షాల కోసం 5,757 మంది, ట్రాక్టర్లు కావాలని 6,420 మంది దరఖాస్తు చేసుకున్నారు. టైలరింగ్, రెడీమేడ్ గార్మెంట్స్ యూనిట్ కోసం 11,606 మంది దరఖాస్తు చేసుకున్నారు.
కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోని నేపథ్యంలో శానిటైజర్ తయారీ యూనిట్ల కోసం 582 మంది దరఖాస్తు చేసుకున్నారు. 12,806 మంది చెప్పుల తయారీకి, సిమెంట్ కాంక్రీట్ మిల్లర్ కోసం 9,914 మంది, గన్నీసంచుల తయారీ, మినీ ఫ్లోర్‌మిల్స్ కోసం 13,865 మంది, పేపర్‌ప్లేట్ యూనిట్ల కోసం 23,058 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా యూనిట్లకు సంబంధించి రూ.9,915.62 కోట్లు అవసరం అవుతాయని, ఇందులో రూ. 5548.81 కోట్లు సబ్సిడీగా, రూ.4,366.80కోట్లు బ్యాంకు రుణాలుగా ఉంటాయని ఎస్సీ కార్పొరేషన్ లెక్కగట్టింది.
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై ముంగిట్లోకే సరుకులు.. త్వరలో రేషన్ రైస్ ఏటీఎం ఏర్పాటు!