SBI: ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్ వచ్చేసింది.. వివరాలివే.!

State Bank Of India: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది...

SBI: ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్ వచ్చేసింది.. వివరాలివే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 22, 2021 | 7:55 AM

State Bank Of India: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి వద్ద నుంచే ఒక ఫోన్ కాల్‌ ద్వారా డెబిట్ కార్డు పిన్, గ్రీన్ పిన్‌ను జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. ఇప్పటికే ఈ సౌకర్యం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా 1800 112 211 లేదా 1800 425 3800 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చునని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. పైన పేర్కొన్న నెంబర్స్‌కు కాల్ చేసి ఈ స్టెప్స్ ఫాలో కావాలని సూచించింది. పిన్ మర్చిపోయిన వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఫాలో కావాల్సిన స్టెప్స్ ఇవే..!

కాల్ చేసిన తర్వాత పిన్ జనరేట్ కోసం ఆప్షన్ 6 ఎంచుకోవాలి

ఆ తర్వాత మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ ఎంటర్ చేయాలి

దీనితో రిజిస్టర్ మొబైల్ లేదా మెయిల్ ఐడీకి ఆరు అంకెల ఓటీపీ వస్తుంది.

నాలుగు అంకెల పిన్ నెంబర్ ఎంచుకుని.. రీ-కన్ఫార్మ్ చేసేందుకు మరోసారి టైప్ చేయండి

ఆ తర్వాత మీ పిన్ జనరేట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.

Also Read: ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?