ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?

Shark With Human Face: వింత ఆకారంలో ఉన్న ఓ షార్క్ పిల్ల.. ఓ మత్స్యకారుడిని సెలబ్రిటీని చేసింది. తంతే బూరెల బుట్టలో పడినట్లు..

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 24, 2021 | 3:25 PM

Shark With Human Face: వింత ఆకారంలో ఉన్న ఓ షార్క్ పిల్ల.. ఓ మత్స్యకారుడిని సెలబ్రిటీని చేసింది. తంతే బూరెల బుట్టలో పడినట్లు.. అది తన దగ్గర ఉంటే అదృష్టం వస్తుందని ఆ జాలరి నమ్మకంతో దాన్ని భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జకార్తాకు చెందిన అబ్దుల్లా అనే ఓ జాలరి ఫిబ్రవరి 21వ తేదీన చేపలు పట్టేందుకు ఈస్ట్ నుసా టెంగ్గర్‌లోని రొట్ న్డాడోకు వెళ్లాడు. చేపల కోసం వల విసరగా.. అతడికి షార్క్ చిక్కుకుంది. మరుసటి రోజు దాని పొట్ట కోసి చూడగా… అతడికి అందులో రెండు షార్క్ పిల్లలు, ఓ వింత ఆకారంలో ఉన్న జంతువు కనిపిస్తుంది. ఆ వింత జంతువు ఏంటో తెలియక అబ్దుల్లా తికమకపడ్డాడు. ముఖం ఏమో ఏలియన్‌లా.. శరీరం ఏమో చేపలా ఉందేమిటీ అని అనుకున్నాడు. అయితే అదొక ఎదగని షార్క్ పిల్ల అని గ్రహించడానికి అతడికి కొంత సమయం పట్టింది.

కాగా, ఆ వింత షార్క్ పిల్లను అబ్దుల్లా ఇంటికి తీసుకెళ్లగా.. దాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారట. ఈ విషయంపై అబ్దుల్లా మాట్లాడుతూ.. ”షార్క్ పిల్లను చూడటానికి ఎంతోమంది జనం మా ఇంటికి వస్తున్నారు. చాలామంది కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే నేను దాన్ని అమ్మడానికి సిద్దంగా లేను. అది నాకు కోట్లను తెచ్చిపెడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!