1/5

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ఈ ఉదయం కొవిడ్ టీకా వేయించుకున్నారు.భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను(CoVaxin) ప్రధాని స్వీకరించారు.
2/5

కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కరోనాపై పోరాడుతున్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు.
3/5

అర్హులందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ఆయన ట్వీట్ చేశారు.
4/5

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండి దీర్ఘకాల వ్యాధిగ్రస్థుకు ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్నారు.
5/5

టీకా తీసుకునేవారు కోవిన్ 2.0 యాప్‌లో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేయనున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్‌లోనే ప్రారంభం అవుతుందని, రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుంది.