AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani: స్ట్రీట్ ఫుడ్‌పై కేంద్ర మంత్రి మోజు.. రోడ్డుపై పానీపూరీ తింటూ కనిపించిన స్మృతి ఇరానీ..

Smriti Irani eat golgappa: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ... ప్రధాని మోదీ నియోజకవర్గం..

Smriti Irani: స్ట్రీట్ ఫుడ్‌పై కేంద్ర మంత్రి మోజు.. రోడ్డుపై పానీపూరీ తింటూ కనిపించిన స్మృతి ఇరానీ..
Sanjay Kasula
|

Updated on: Mar 01, 2021 | 2:58 PM

Share

Smriti Irani Eat Golgappa: పానీపూరీ, గోల్గప్పా, పుచ్కా ఇలా ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. అంతేకాదు పానీపూరి అంటే పడిచస్తారు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు దీన్ని తినేందుకు సై అంటారు. అంతలా ప్రజల్లో ఆదరణ పొందింది పానీ పూరి. ఇక వారణాసిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటించారు. వారణాసిలో పానీపూరీ తింటూ కనిపించారు.

పానీపూరీ తింటూ కేంద్ర మంత్రి..

వాస్తవానికి..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బిజెపి స్థంస్థాగత సమావేశంలో పాల్గొనడానికి వారణాసి వచ్చారు. దారిలో వెళ్తుండగా చాట్ దుకాణాన్ని చూసిన వెంటనే ఆమె ఆగిపోయారు. వారణాసిలోని బనారసి చాట్ అంటే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చాలా ఇష్టం.

వారణాసి వచ్చిన ఆమె కచహరీ ప్రాంతంలోని ఒక స్ట్రీట్ ఫుడ్ దుకాణానికి చేరుకుని, పానీ పూరీని ఎంతో ఇష్టంగా తిన్నారు. ఆమెను పానీపూరీ ఎలా ఉందని షాప్ ఓనర్ అడిగిన ప్రశ్నకు.. ‘హరహర మహాదేవ్’ అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ అతడికి వెయ్యి రూపాయలను ఇచ్చారు. అలాగే ‘ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి’ అని కూడా అన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్ట్రీట్ ఫుడ్‌ను తెగ ఇష్టపడతారు. ఆమెకు వారణాసి గోల్‌గప్పా అంటే ఎంతో ఇష్టం.

వారణాసిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పర్యటన

కాగా స్మృతి ఇరానీ వారణాసిలో జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. అదే సమయంలో అక్కడి స్థానికులు స్మృతి ఇరానీ చూసి ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

ఇవి కూడా చదవండి..

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే.. Vinesh returned- రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ మెరిసింది.. వినేశ్‌ పసిడి పట్టు.. ప్రపంచ ఛాంపియన్‌పై గెలుపు కీవ్‌ PM Modi takes Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ