కో-విన్ 2.0 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. ఎవరు అర్హులు.. ఎలా పేరు నమోదు చేసుకోవాలి.? వివరాలివే.!
Co-WIN Registration: దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే..
Co-WIN Registration: దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా అందించనున్నారు. హైదరాబాద్‌లో 12, ఇతర జిల్లా కేంద్రాల్లో 2 చొప్పున కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే సీనియర్ సిటిజన్స్, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కో-విన్ పోర్టల్ ద్వారా కోవిడ్ టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ రెండోదశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సుమారు 27 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇవ్వాలని కేంద్రం పక్కగా ప్రణాళికలు సిద్దం చేసింది.
కో-విన్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం కో-విన్ 2.0గా అప్‌గ్రేడ్ చేసింది.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
కొవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా cowin.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో కొవిడ్ టీకా తీసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేసినా తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతారు.
అందరూ మొదటి రోజే వ్యాక్సిన్ తీసుకునేందుకు తొందరపడవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్‌చైర్‌లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా వేస్తారు. ఇందుకు ఒక్క డోస్‌కు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ధర రూ.150 కాగా.. సర్వీస్ చార్జీ రూ.100. ఇంతకంటే ఎవరూ ఎక్కువగా వసూలు చేయకూడదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇచ్చాయి. అలాగే కో-విన్ యాప్ ఇంకా పూర్తి కాలేదని.. కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం అందరూ కూడా వెబ్ సైట్‌ను సందర్శించాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని ఇక్కడ చదవండి:
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!
Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!