PM Modi takes Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ

Sanjay Kasula

|

Updated on: Mar 01, 2021 | 9:49 AM

COVID Vaccine: ప్రధాని మోదీ కోవిడ్ వ్యాక్సిన్‌ మొదటి డోస్ తీసుకున్నారు. రెండవ దశ ఇమ్యునైజేషన్ డ్రైవ్ ప్రారంభం కాగానే పిఎం మోడీ కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్నారు.

Covid-19 Vaccination: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ఈ ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. రెండవ దశ ఇమ్యునైజేషన్ డ్రైవ్ ప్రారంభం కాగానే పిఎం మోడీ కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్నారు. భారత్ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను(CoVaxin) ప్రధాని స్వీకరించారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద సిరంజీ ద్వారా మోదీకి టీకా అందించారు. ఎయిమ్స్ వద్ద నా మొదటి మోతాదు COVID-19 టీకా తీసుకున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కరోనాపై పోరాడుతున్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ఆయన ట్వీట్‌ చేశారు.

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండి దీర్ఘకాల వ్యాధిగ్రస్థుకు ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్నారు. టీకా తీసుకునేవారు కోవిన్‌ 2.0 యాప్‌లో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.

వారం రోజులపాటు పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో ప్రధాన నగరాల పరిధిలో ముఖ్యమైన కేంద్రాల వివరాలు వస్తాయి. వీటి ఫలితాల బట్టి మిగతావారికి టీకా కేంద్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవాళ కొందరు ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు పరిమిత సంఖ్యలో టీకా వేయనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.

సోమవారం లాంచనంగా సాధారణ జనానికి టీకా కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఎంపిక చేసిన 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ ఉంటుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేయనున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్‌లోనే ప్రారంభం అవుతుందని, రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇష్యూకు రానున్నా పసిడి బాండ్లు.. మార్చి 5 వరకు గోల్డెన్ ఛాన్స్.. నాలుగు కిలోల వరకు కొనేందుకు అనుమతి

RBI Instructions : చిరిగిపోయిన కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు.. బాధితులు వాటిని మార్చుకోవడానికి ఏం చేయాలంటే..

3rd Wave Dangerous : నిర్లక్ష్యం చేస్తే మూడో ముప్పు తప్పదు.. థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్న సీఎస్ఐర్..

Published on: Mar 01, 2021 07:25 AM