AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇష్యూకు రానున్నా పసిడి బాండ్లు.. మార్చి 5 వరకు గోల్డెన్ ఛాన్స్.. నాలుగు కిలోల వరకు కొనేందుకు అనుమతి

Sovereign Gold: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సోమవారం (మార్చి 1) నుంచి ఇష్యూకు రానున్నాయి. మార్చి 5 వరకు సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉండనుంది. ఈ ఆర్థిక..

ఇష్యూకు రానున్నా పసిడి బాండ్లు.. మార్చి 5 వరకు గోల్డెన్ ఛాన్స్.. నాలుగు కిలోల వరకు కొనేందుకు అనుమతి
Sanjay Kasula
|

Updated on: Mar 01, 2021 | 12:25 AM

Share

Sovereign Gold Bond Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సోమవారం (మార్చి 1) నుంచి ఇష్యూకు రానున్నాయి. మార్చి 5 వరకు సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉండనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి సిరీస్ కానుంది. ఈ పసిడి బాండ్ అమ్మకాలు 2021 మార్చి 5న ముగుస్తాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి సిరీస్. ఈ గోల్డ్ బాండ్ అమ్మకాలు 2021 మార్చి 5 తేదీతో ముగుస్తాయి. ఈ సిరీస్‌కు ధరను కూాడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసింది. ఒక గ్రాము సావరిన్ గోల్డ్ బాండ్ ధర రూ.4,662 అని నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో కొనేవారికి రూ.50 డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.

అంటే ఒక గ్రాము బంగారాన్ని రూ.4,612 ధరకు కొనొచ్చు. ప్రతీ సారి గత మూడు రోజుల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 999 స్వచ్ఛత గల బంగారానికి నిర్ణయించిన ధరను యావరేజ్ చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఆర్‌బీఐ ఫిక్స్ చేస్తుంది . అంటే ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య ఉన్న బంగారం ధరను యావరేజ్ చేసి గ్రాముకు రూ.4,662 ధరను ఫిక్స్ చేసింది. ఈ సిరీస్‌లో గోల్డ్ బాండ్స్ కొన్నవారికి 2021 మార్చి 9న సెటిల్మెంట్ అవుతుంది. ఫిజికల్‌గా బంగారం  కొనకుండా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

ఏమిటీ సార్వభౌమ పసిడి బాండ్లు?

సార్వభౌమ పసిడి బాండ్లు (SGB) ప్రభుత్వం అందించే బాండ్ల లాంటివే. ప్రభుత్వం తరఫున వీటిని ఆర్​బీఐ జారీ చేస్తుంది. ఎస్​జీబీలనూ గ్రాముల చొప్పునే తీసుకోవాల్సి ఉంటుంది.

2.5 శాతం రాబడి..

దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు ఎస్​జీబీలను 2015లో ఆర్బీఐ ప్రవేశపెట్టారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు అంటున్నారు. వీటి ద్వారా భౌతికంగా బంగారం దాచిపెట్టుకోవటం వల్ల ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. వార్షికంగా 2.5 శాతం రాబడి కూడా వస్తుంది. వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు. ఫిజికల్ గా నగల్లో ఉండే మేకింగ్‌ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది వీటిలో ఉండదు.

మెచ్యూరిటీ పీరియడ్‌..

ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్‌లో ఉన్న బంగారం ధరకు ప్రకారమే అప్పటి ధర నిర్ణీతమౌతుంది.

ఒక వ్యక్తి కనీసం 1 గ్రాము నుంచి 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. హిందూ అవిభాజ్య సంస్థలకు కూడా 4కిలోల పరిమితి ఉంది. ట్రస్ట్‌లకు 20కిలోల గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఈ పరిమితి ఒక ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఇష్యూలలో కలిపి ఈ స్థాయి వరకు కొనుగోలు చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసినవి కూడా దీని పరిధిలోకి వస్తాయి.

Read also : రాహుల్ అలుపెరుగని కష్టం, వెనుక.. పార్టీ సీనియర్ల వెన్నుపోట్లు, వెరసి, ఐదు రాష్ట్రాల ఎన్నికలవేళ కాంగ్రెస్‌లో వితపోకడలు