AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3rd Wave Dangerous : నిర్లక్ష్యం చేస్తే మూడో ముప్పు తప్పదు.. థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్న సీఎస్ఐర్..

3rd Wave Dangerous : దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే మూడో దఫా (థర్డ్‌ వేవ్‌)

3rd Wave  Dangerous : నిర్లక్ష్యం చేస్తే మూడో ముప్పు తప్పదు.. థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్న సీఎస్ఐర్..
uppula Raju
|

Updated on: Mar 01, 2021 | 5:36 AM

Share

3rd Wave Dangerous : దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే మూడో దఫా (థర్డ్‌ వేవ్‌) ప్రమాదం పొంచి ఉందని కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి మండే స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ కట్టడిని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేషనల్‌ సైన్స్‌ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెచ్చరించారు.

ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు అన్ని వ్యవస్థలూ కలిసికట్టుగా పోరాడాలని సీఎస్‌ఐఆర్‌ డీజీ అభిప్రాయపడ్డారు. యావత్‌ మానవాళిపై తీవ్ర ప్రభావం చూపే పర్యావరణ మార్పులు, శిలాజ ఇంధనాల వాడకంపై తీవ్రంగా ఆధారపడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే దాఖలాలు ప్రస్తుతం భారత్‌లో సమీప భవిష్యత్‌లో కనిపించడం లేదన్న ఆయన.. వైరస్‌ దరిచేరకుండా ఉండేందుకు మాస్కులు, భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ ముప్పు తొలగిపోయిందని నిర్లక్ష్యం చేస్తే మూడో ముప్పు (థర్డ్‌ వేవ్‌) వల్ల భారత్‌ ఇప్పటివరకు ఎదుర్కొన్న సవాళ్ల కంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కొత్తరకం కరోనాపైనా పనిచేసే అవకాశం ఉందని మండే అభిప్రాయపడ్డారు. కొత్తరకంపై పనిచేయవని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలూ ప్రస్తుతం లేవని.. అందుచేత వ్యాక్సిన్‌ల సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని స్పష్టంచేశారు.

సెకెండ్ వేవ్ కరోనా వ్యాప్తిపై అలర్ట్.. కేసీఆర్ కీలక సమీక్ష.. కరోనా విజృంభించే ఛాన్స్ వుందని హెచ్చరిక

Covid19 Wave Worry: పంజాబ్‌లోని ముఖ్య నగరాలు, పట్టణాలలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..