Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!

Bigg Boss Season 5: బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో అంటే టీవీ..

Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2021 | 12:03 PM

Bigg Boss Season 5: బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో అంటే టీవీ వీక్షకులకు చాలా ఇంట్రస్ట్. ఎన్నో విమర్శలు వచ్చినా అదిరిపోయే రేటింగ్‌లో దూసుకుపోతుంది. ప్రాంతీయ భాషలన్నింటిలోనూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజ్ అంతా, ఇంతా కాదు. లాస్ట్ సీజన్ అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ వినోదం పంచారు.

తాజాగా తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ ఐదవ సీజన్‌ ప్రారంభం కానుంది. దీని కోసం నిర్వాహకులు కంటెస్టెంట్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం నిర్వాహకులు పలువురు కంటెస్టెంట్లను సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటికి వచ్చింది. దీని ప్రకారం.. కూకూ విత్‌ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్‌ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్‌తో పాటు.. లక్ష్మీ రాయ్‌, పూనమ్‌ భజ్వా, కిరణ్‌, హేమ, సీనియర్‌ నటి రాధ, హీరో సిద్ధార్థ్‌లతో సంప్రదింపులు జరపారని సమాచారం. అటు టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి తమిళ బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి:

లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!