Viral Video: లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

ఆమె మాస్క్ లేకుండా సరాసరి సూపర్ మార్కెట్‌లో ఎంటర్ అయిపోయింది. కావాల్సిన సరుకులు, సామాగ్రి అంతా తీసుకుంది. ఎవరూ పట్టించుకోలేదు..

Viral Video: లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Mar 03, 2021 | 11:18 AM

ఆమె మాస్క్ లేకుండా సరాసరి సూపర్ మార్కెట్‌లో ఎంటర్ అయిపోయింది. కావాల్సిన సరుకులు, సామాగ్రి అంతా తీసుకుంది. ఎవరూ పట్టించుకోలేదు కదా.. బిల్లింగ్ వేయించుకుని ఇంచక్కా బయటికి వెళ్ళిపోదాం అని ఊహించుకుంది. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. సెక్యూరిటీ గార్డు ఆమెను చూసి మాస్క్ పెట్టుకోమని చెప్పాడు. ఆమె మాస్క్ లేదని చెప్పేటప్పటికీ.. మాస్క్ లేకపోతే.. బిల్లింగ్ కుదరదని తేల్చి చెప్పాడు. దీనితో చేసేది ఏమీలేక తన లోదుస్తులను మాస్క్‌గా ధరించింది. అది చూసిన సెక్యూరిటీ గార్డ్‌తో పాటు అక్కడున్న జనాలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ఓ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. ఆ మార్కెట్ పేరు పిక్ అండ్ పే.. అక్కడ కరోనా వైరస్ స్ట్రెయిన్‌గా రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తుండటంతో మాస్క్ తప్పనిసరి చేశారు. అయినా కూడా ఆ రూల్స్‌ను బేఖాతరు చేసి మాస్క్ లేకుండా దర్జాగా మాస్క్ లేకుండా మార్కెట్‌లోకి ప్రవేశించింది.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె చేసిన పనిని చూసి నవ్వుకోగా.. మరికొందరు అది మార్కెట్ కదా.. మాస్కులు అమ్ముతారు. ఒకటి కొనుకకోవచ్చు. లేదంటే… ఏ కర్చీఫో కొనుక్కొని మాస్కులా పెట్టుకోవచ్చు అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!

పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. నెటిజన్ ప్రశ్నకు ఆషూ ఆన్సర్.. వైరల్ ట్వీట్.!