- Telugu News Photo Gallery Science photos People converting petrol engine bike into electric engine check here all details about this engine
Electric Bike: పెట్రోల్ భారం.. బైక్‌లకు బ్యాటరీ ఇంజన్.. ఎలా మారుస్తారంటే..?
Battery Engine Bike: దేశంలో ఇటీవల కాలంలో నిరంతరం పెట్రో ధరలు పెరుగుతుండటంతో.. వాటినుంచి తప్పించుకునేందుకు పలువురు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో...
Updated on: Mar 04, 2021 | 5:29 PM

Battery Engine Bike: దేశంలో ఇటీవల కాలంలో నిరంతరం పెట్రో ధరలు పెరుగుతుండటంతో.. వాటినుంచి తప్పించుకునేందుకు పలువురు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ ఇంజన్‌లకు బదులుగా బ్యాటరీలను బిగిస్తున్నారు.

Batterప్రస్తుతం ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్రవాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలామంది ఉన్న వాహనాలకు బ్యాటరీలను బిగిస్తూ పెట్రో భారం నుంచి తప్పించుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. y Bike

దీనికోసం సుమారు 10 వేల రూపాయలు ఖర్చవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. బ్యాటరీ ప్రకారం.. ఛార్జీల ధర ఉంటుందని.. వేగం మాత్రం గంటకు 65-70 కి.మీ. ప్రయాణించవచ్చంటూ వెల్లడిస్తున్నారు.

పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేటప్పుడు.. గేర్ బాక్స్ తొలగించి, యాక్సిలరేటర్‌కు నేరుగా అనుసంధానం చేస్తారు. యాక్సిలేటర్ ద్వారా అంటే స్కూటీ లాగా వాహనాన్ని నియంత్రించవచ్చని తెలుపుతున్నారు. 2 గంటలపాటు బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే.. 40 కిలోమీటర్లు నడపవచ్చు.

ఇలాంటి వారు.. మరో విషయాన్ని మర్చిపోతున్నారు.. ఇలా చేస్తే.. చట్టవిరుద్ధమని.. కేసులు నమోదవుతాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. మోటారు వాహన చట్టం 1988 లోని సెక్షన్ 52 ప్రకారం.. కేసుతోపాటు, జరిమానా విధిస్తారు. బీమాను కూడా క్యాన్సెల్ చేస్తారు.




