Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!
Delhi Boy Proposes A Girl: సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఏదొక విషయం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని...
Delhi Boy Proposes A Girl: సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఏదొక విషయం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్నింటి గురించి జనాలు జోరుగా చర్చించుకుంటారు. ఇలా అలాంటి వాటిల్లో ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఓ అందమైన ప్రేమలేఖను రాశాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ ప్రేమలేఖకు అమ్మాయి ఇచ్చిన రిప్లై చూస్తూ నవ్వులు పువ్వులు పూస్తాయి.
ఈ రోజుల్లో ప్రతిచోటా ప్రేమ గురించే చర్చ. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, వారు తమ ప్రేమను విభిన్న మార్గాల ద్వారా వ్యక్తపరుస్తుంటారు. సరిగ్గా ఇలాగే సరికొత్తగా తన ప్రేమను వ్యక్తపరచడానికి ట్రై చేశాడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధి. అందుకు సంబంధించిన లెటర్ ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ లెటర్ సారంశం ఇదే…
‘నేను ఢిల్లీకి చెందినవాడిని… ఇప్పుడు నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా.. నువ్వు చాలా అందంగా ఉన్నావు… నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా?’ ‘నా తండ్రికి ఇక్కడ చాలా పెద్ద షిప్పింగ్ వ్యాపారం ఉంది. నేను నీ కోసం ఏదైనా చేస్తాను. కానీ దయచేసి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి అవుతావా’.. అంటూ తన ప్రేమించే అమ్మాయికి ఇంటర్ విద్యార్ధి లేఖ రాశాడు.
అదే సమయంలో ఈ లేఖకు అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన రిప్లై నెటిజన్లు విపరీతంగా నవ్వించింది.
‘దయచేసి పాఠశాల తెరవండి’ అని అమ్మాయి ఆ లేఖకు తిరిగి రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా ‘నీ లేఖను పెద్దగా పట్టించుకోవడం లేదు, కేవలం ఫన్నీగా ఉంది’ అని బదులిచ్చింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ట్వీట్లపై ఓ లుక్కేయండి.
Also Read:
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!
Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!
Please restart schools pic.twitter.com/MgYDFG7RKL
— anti pigeon (@aluminiummaiden) March 3, 2021