1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!

Cricket Black Day: మంగళవారం, మార్చి 3, 2009 క్రికెట్ చరిత్రలో ఓ బ్లాక్ డే.. గేమ్ ఆడేందుకు స్టేడియం చేరుకుంటున్న ఓ ఆటగాళ్ల బృందంపై ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ..

1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!
Follow us

|

Updated on: Mar 03, 2021 | 7:50 PM

Cricket Black Day: మంగళవారం, మార్చి 3, 2009 క్రికెట్ చరిత్రలో ఓ బ్లాక్ డే.. గేమ్ ఆడేందుకు స్టేడియం చేరుకుంటున్న ఓ ఆటగాళ్ల బృందంపై ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. ఈరోజు క్రికెట్ చరిత్రలో మరువలేని రోజుగా ముద్రబడింది. 12 సంవత్సరాల క్రితం, లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు వెళ్తున్న శ్రీలంక క్రికెటర్స్ టీం బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసింది ఈ రోజే. ఈ సంఘటన ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది.

అప్పుడు పాకిస్థాన్, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్ అంతా బాగానే జరిగింది కానీ.. రెండో టెస్టు మూడో రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఆటగాళ్ల బృందం హోటల్ నుండి బస్సులో గడాఫీ స్టేడియానికి బయల్దేరగా.. మార్గం మధ్యలో ముసుగులు వేసుకుని ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ వచ్చే విపత్తును ముందుగానే గమనించడంతో చాకచక్యంగా తప్పించుకోగలిగారు. కొంతమంది ఆటగాళ్ల మాత్రం గాయాలయ్యాయి. శ్రీలంక కెప్టెన్ మహేలా జయవర్ధనే, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, అజంతా మెండిస్, తిలాన్ సమరవీర, తరంగ పరవితారానాలు ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

12 మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారు…

లష్కరే జాంగ్వి అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు నివేదికలు వచ్చాయి. ఆగస్టు 2016లో, ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను లాహోర్‌లో పోలీసులు కాల్చి చంపారు. దీని తరువాత, అక్టోబర్‌లో, ఈ దాడికి ప్రధాన సూత్రధారిని తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని సైనిక ఆపరేషన్‌లో చంపబడ్డాడు. ఇక ఈ దాడి తరువాత, శ్రీలంక జట్టు 2019 డిసెంబర్‌లో మళ్లీ పాకిస్థాన్‌లో పర్యటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. నెటిజన్ ప్రశ్నకు ఆషూ ఆన్సర్.. వైరల్ ట్వీట్.!

Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..