ఇంగ్లాండ్‌ జట్టుకు దారులు మూసుకుపోలేదు.. నాలుగో టెస్ట్‌లో ఎలా గెలవాలో సూచనలిస్తున్న మాజీ ప్లేయర్..

Kevin Pietersen coments : ఇంగ్లాండ్‌ జట్టుకు దారులు మూసుకుపోలేదని.. పోరాడితే తప్పకుండా నాలుగో టెస్ట్‌లో విజయం సాధించవచ్చని చెబుతున్నాడు

ఇంగ్లాండ్‌ జట్టుకు దారులు మూసుకుపోలేదు.. నాలుగో టెస్ట్‌లో ఎలా గెలవాలో సూచనలిస్తున్న మాజీ ప్లేయర్..
Follow us
uppula Raju

|

Updated on: Mar 03, 2021 | 7:31 PM

Kevin Pietersen coments : ఇంగ్లాండ్‌ జట్టుకు దారులు మూసుకుపోలేదని.. పోరాడితే తప్పకుండా నాలుగో టెస్ట్‌లో విజయం సాధించవచ్చని చెబుతున్నాడు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌. తాజాగా ఆన్‌లైన్‌లో బ్లాగ్‌లో జట్టుకు కావలసిన పలు సూచనలు అందించాడు. నాలుగో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ డ్రా చేసుకోవచ్చని హితబోధ చేశాడు. అయితే అది ఎలా చేయాలో అనుభవ పూర్వకంగా వివరించాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులోనూ పిచ్‌లో పెద్దగా మార్పులుండవని తెలిపాడు. మొతేరాలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తి అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీటర్సన్‌ ఆ వ్యాఖ్యలు చేశాడు.

‘తర్వాతి మ్యాచ్‌లో పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బాగా బ్యాటింగ్‌ చేస్తే.. పరిస్థితుల్ని ఆధీనంలోకి తెచ్చుకొనే అవకాశం ఉంది. భారత్‌లో వైఫల్యానికి ఇంగ్లాండ్‌ యువ బ్యాట్స్‌మెన్‌ను నిందించడం లేము. ఎందుకంటే వారికిది తొలి పర్యటన. ఇదో అనుభవం వలే ఉంటుంది. ఇప్పటికే ఓడిపోయిన మ్యాచ్‌ల గురించి ఆందోళన చెందకుండా, తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించడంపై ప్రశాంతంగా ఆలోచించాలి. ఇంతకన్నా బాగా ఆడాలేనా?మెరుగవ్వాలంటే ఇంకేం చేయాలనే విషయాలపై దృష్టిసారించాలి’ అని పీటర్సన్‌ వారికి సూచించాడు.

కాగా, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 277 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాక రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆపై పింక్‌బాల్‌ టెస్టులోనూ పది వికెట్లతో ఘన విజయం సాధించి పర్యాటక జట్టును కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో ఆ జట్టు ఎలా ఆడనుందో వేచి చూడాలి. ఇక భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిచినా, డ్రా చేసుకున్నా జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడే అవకాశం ఉంది.

‘యూవీ‌ ‌ఎందుకంత క్యూట్‌గా ఉన్నావ్’ : కెవిన్‌ పీటర్సన్ క్రేజీ కామెంట్

hollywood actor will smith : పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న హాలీవుడ్ స్టార్.. ఎందుకో కారణాలు తెలియజేసిన కండల వీరుడు..