Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..

‘క్రికెట్ కింగ్’ హర్భజన్ సింగ్, ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కలయికలో… రూ. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం ‘‘ఫ్రెండ్ షిప్’’..

Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 03, 2021 | 2:04 PM

Friendship movie : క్రికెటర్ హర్భజన్ సింగ్, ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కలయికలో… రూ. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం ‘‘ఫ్రెండ్ షిప్’’.. జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘‘ఫ్రెండ్ షిప్’’ పేరుతోనే.. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్‌లైన్ జోడించి.. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు నిర్మాత ఏ.ఎన్. బాలాజీ. మాజీ ‘మిస్ శ్రీలంక’ మరియు తమిళ బిగ్‌బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎస్‌కె) విలన్‌గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతోపాటు హిందీ తమిళ భాషల్లో విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లింక్ లను షేర్ చేశాడు భజ్జీ. ‘నా మూవీ ‘ఫ్రెండ్షిప్’ టీజర్ వచ్చేసింది. లింక్స్ ఇక్కడ ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి గాయ్స్’ అంటూ ట్వీట్ చేశాడు హర్భజన్. బజ్జి సినిమా టీజర్ చూసిన అతడి సహచరులు. సురేష్ రైనాతోపాటు మరికొందరు ఆటగాళ్లు భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా బాగుందని సినిమా సక్సెస్ అవుతుందని అవ్వాలని ఆశిస్తున్నారు.

హర్భజన్ సింగ్‘‘ఫ్రెండ్ షిప్’’ టీజర్ :

మరిన్ని ఇక్కడ చదవండి : 

IT Raids In Bollywood: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న ఐటీ దాడులు.. నటి తాప్సీతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు..

Actress Meena : తరగని అందంతో ఆకట్టుకుంటున్న సీనియర్ హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు..