IT Raids In Bollywood: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న ఐటీ దాడులు.. నటి తాప్సీతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు..
IT Raids In Bollywood: ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల ఆకస్మిక దాడులతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అలజడి రేగుతోంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఏక కాలంలో..
IT Raids In Bollywood: ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల ఆకస్మిక దాడులతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అలజడి రేగుతోంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఏక కాలంలో ఐటీ దాడులు జరుగుతుండడంతో నటీ, నటులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలకు దిగారు. నటి తాప్సీతో పాటు అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, మధు మంతెన సహా పలువురు ప్రముఖుల ఇళ్లతో పాటు కార్యలయాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పుణె, ముంబైలో ఏకంగా 22 చోట్ల అధికారులు ఈ సోదాలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో ఎలాంటి డ్యాక్యుమెంట్లు దొరికాయి లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సోదాలపై అధికారులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. నటి తాప్సీ ఇంట్లోనూ ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఐటీ దాడులకు ఫాంటమ్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ సంస్థ కారణంగా తెలుస్తోంది. 2011లో అనురాగ్ కశ్యప్, అతని స్నేహితులు వికాస్ బెహల్, మధు మంతెన, విక్రమ్ కలిసి ఫాంటమ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించారు. వీరు ఈ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా అనేక సినిమాలను తీస్తూ వచ్చారు. అనంతరం 2015 లో ఈ సంస్థలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ 50 శాతం వాటాలను కొనుగోలు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగిందని, లావాదేవీలను పూర్తిగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు చూపించలేదన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులకు దిగినట్లు తెలుస్తోంది.
Also Read: Amala Paul : ‘విడిపోయిన తర్వాత జీవితమే ఉండదని అన్నారు’.. ఎమోషనల్ అయిన హీరోయిన్..