Amala Paul : ‘విడిపోయిన తర్వాత జీవితమే ఉండదని అన్నారు’.. ఎమోషనల్ అయిన హీరోయిన్..
అమలాపాల్.. సిద్ధర్థ్ నటించిన లవ్ ఫెయిలర్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాల్లో..
Amala Paul Emotional: అమలాపాల్.. సిద్ధార్థ్ నటించిన ‘లవ్ ఫెయిలర్’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే మంచి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ కుర్రది.. నాగచైతన్య తో బెజవాడ, రామ్ చరణ్ సరసన ‘నాయక్’, అల్లు అర్జున్ కు జోడీగా ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో నటించి ఆకట్టుకుంది.
అయితే సినిమాలో రాణిస్తున్న సమయంలోనే తమిళ దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ బ్యూటీ. విజయ్ దర్శకత్వంలోనే అమలాపాల్ రెండు సినిమాలలో నటించింది. ఆసమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్ళైన కొద్దిరోజులకే మనస్పర్థల కారణంగా విజయ్ అమలాపాల్ ఇద్దరు విడిపోయారు. ఇక విజయ్ మరో వివాహం చేసుకోగా అమలాపాల్ సినిమాలతో తిరిగి బిజీ అయ్యింది.
ఆతర్వాత ఈ అమ్మడు మరో వ్యక్తితో ప్రేమలో ఉందని అతడితో చట్టపట్టాలేసుకు తిరుగుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆవార్తల పై అమలాపాల్ స్పంచించలేదు. తాజాగా తన మాజీ భర్త విజయ్ తో ఎందుకు విడిపోయిన విషయం పైన స్పందించింది అమలాపాల్. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్ లో బోల్డుగా నటించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయ్ తో విడిపోయిన సమయంలో తనను ఎవ్వరూ పట్టించుకోలేదని అంది. అలాగే విడిపోయిన తర్వాత తనకు జీవితమే ఉండదని చెప్పారు కానీ ఆ తర్వాత అందరికీ తానేంటో అర్థమైపోయిందని తెలిపింది అమల. నువ్వొక అమ్మాయివి.. నీ కెరీర్ పాడైపోతుంది అంటూ బెదిరించారని చెప్పింది. ఆ సమయంలో ఒక్కరు కూడా తనను సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది అమలాపాల్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Shraddha Kapoor : అందాల కుందనపు బొమ్మ ఈ బాలీవుడ్ భామ… అమ్మడి బర్త్ డేకు వెల్లువెత్తుతున్న విషెస్