మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!

Gold Price News: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో 'అగ్రిసెస్' ప్రస్తావన తెచ్చిన దగ్గర నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతూనే..

  • Ravi Kiran
  • Publish Date - 6:39 pm, Thu, 4 March 21
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!

Gold Price News: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ‘అగ్రిసెస్’ ప్రస్తావన తెచ్చిన దగ్గర నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. 2021 జనవరి 5వ తేదీ నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర గరిష్టంగా రూ. 52,360 ఉండగా.. అది కాస్తా నేటికి రూ. 45,600కి చేరుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600గా ఉంది.. అంటే రెండు నెలల్లో దాదాపుగా రూ. 6,760 తగ్గింది. పసిడి ప్రియులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ కాగా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైతే మళ్లీ పసిడి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నందున.. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

కాగా, బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యూవెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్నటితో పోలిస్తే హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 మేరకు తగ్గి రూ.41,800కు చేరుకుంది. అలాగే పసిడి బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2,400 మేర తగ్గి రూ. 70,400కి చేరింది.

Also Read:

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!