AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk : భారత్‌లో అడుగుపెట్టనున్న ప్రపంచ కుబేరుడు.. టెలికాం రంగంలో ఎంట్రీ.. ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

Elon Musk Internet Service: ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భారత టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడు. తన ఏరోస్పేస్

Elon Musk : భారత్‌లో అడుగుపెట్టనున్న ప్రపంచ కుబేరుడు..  టెలికాం రంగంలో ఎంట్రీ.. ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
uppula Raju
|

Updated on: Mar 04, 2021 | 7:09 PM

Share

Elon Musk Internet Service: ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భారత టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడు. తన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ అనుబంధంగా ఉన్న ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్ సేవలను భారత్‌లోనూ ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం ఇప్పటికే భారత్‌లో ప్రీ బుకింగ్‌లను సైతం ప్రారంభించినట్టు తెలుస్తోంది. 2022 నుంచి ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. హై-క్వాలిటీ ఇంటర్నెట్ సదుపాయాలను మారుమూల ప్రాంతాలకు కూడా అందించాలనే లక్ష్యంతో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది.

ఈ ఇంటర్నెట్ ద్వారా 50ఎంబీపీఎస్ నుంచి 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందుతున్నాయని, రానున్న రోజుల్లో 1జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించవచ్చని సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రారంభించిన ప్రీబుకింగ్ ధరను రూ. 7,200గా నిర్ణయించగా, కంపెనీ వెబ్‌సైట్‌లో ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి ఈ సేవలను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ప్రీబుకింగ్ అనంతరం నెలవరీ ఎంత వసూలు చేయనున్నారనే దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గతేడాది సెప్టెంబర్‌లో దేశీయ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు స్పేస్ఎక్స్ ఈ ఇంటర్నెట్ సేవల కోసం లేఖను రాసింది. అన్ని రకాల అనుమతులు లభిస్తే గనక 2022 నుంచి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు భారత్‌లో ప్రారంభం కానున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్‌కి చెందిన కంపెనీ బుధవారం స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ‘సీరియల్ నెం.10’ (ఎస్ ఎన్ 10) రాకెట్‌ను ప్రయోగించింది. అయితే అది పదినిమిషాలకు కుప్పకూలిపోయింది. తన స్పేస్ ఎక్స్ రాకెట్ ని ఏదో ఒక రోజున వ్యోమగాములతో చంద్రునిపైకి, అంగారకునిపైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. తాజా పరిణామంపై ఆయన స్పందిస్తూ తమ టీమ్ గ్రేట్ వర్క్ చేసిందని, ఏదో ఒకరోజున స్టార్ షిప్ ఫ్లైట్స్ సాధారణమే పోతాయని ఆయన అంటున్నారు. కాగా మళ్ళీ తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఆయన పేర్కొంటున్నారు. ఇప్పటికే తన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ నమూనాలను ఆయన హాలీవుడ్ చిత్రాల్లో వినియోగించిన ప్రోటోటైప్ ఇమేజీలతో పోలుస్తున్నారు.

జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా..! అయితే ఇది చూడండి.. డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘పేపాల్’ నుంచి 1000 మందికి అవకాశం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..