పాక్ లోని సింధ్ లో 13 ఏళ్ళ బాలిక కిడ్నాప్, పెళ్లి, బలవంతపు మతమార్పిడి
పాకిస్తాన్ లోని సింధ్ లో దారుణం జరిగింది. కవితా బాయి అనే 13 ఏళ్ళ హిందూ బాలికను ఓ వ్యక్తి ఎత్తుకుపోయి ఆమెను బలవంతంగా ఇస్లామ్ మతంలోకి మార్చాడు.
పాకిస్తాన్ లోని సింధ్ లో దారుణం జరిగింది. కవితా బాయి అనే 13 ఏళ్ళ హిందూ బాలికను ఓ వ్యక్తి ఎత్తుకుపోయి ఆమెను బలవంతంగా ఇస్లామ్ మతంలోకి మార్చాడు. అనంతరం మత గురువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. సింధ్ లోని కాష్మోర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. బాహల్కని అనే గిరిజన తెగకు చెందిన ఈ వ్యక్తి ఈమెను ఇటీవల అపహరించుకుపోయి ఇలా ఆమె ఇష్టానికి విరుద్ధంగా మత మార్పిడి చేసాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నెల 8 న అయిదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి తన కూతుర్ని కిడ్నాప్ చేశారని కవితా బాయి తండ్రి పేర్కొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆయన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఫిర్యాదు చేశారు. కవితా బాయిని నిన్న కోర్టులో హాజరు పరచగా ఆమె 18 ఏళ్ళ యువతిగా కనిపించిందని వార్తలు వచ్చాయి. ఆమె వాంగ్మూలం తీసుకున్న అనంతరం ఆమెను కాష్మోర్ జిల్లా నుంచి గోట్నీ అనే మరో ప్రాంతానికి తరలించారు.
కాగా తన తలిదండ్రులకు ఈ వ్యక్తితో తన పెళ్లి ఇష్టం లేదని, తనకు కోర్టు రక్షణ కల్పించాలని కవితా బాయి కోరినట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం తాజాగా ఓ కేసు నమోదు చేశారు. మైనర్ బాలికకు, పెద్దవాడైన వ్యక్తికి మధ్య పెళ్ళిజరిగిన పక్షంలో అది ఆ వ్యక్తి నేరమవుతుందని, అతనికి మూడేళ్ళ జైలు శిక్ష పడుతుందని వారు అంటున్నారు. అటు- కవితా బాయి వయస్సు ఎంతో నిర్ధారించేందుకు డీఎన్ఎ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇటీవల పాక్ లోని బెలూచిస్థాన్ వంటి రాష్ట్రాల్లోఇలా బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు. పాక్ ఆర్మీ, ప్రభుత్వ అణచివేత విధానాలను భరించలేక అనేకమంది ఇతర దేశాలకు తరలిపోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
Axis Bank: ఇకపై పేమెంట్ చేయడం మరింత సులభం.. సరికొత్త డివైజ్‌లు తీసుకొచ్చిన యాక్సిస్..