South African COVID-19 Strain : భారత్‌లో అడుగు పెట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన కొత్త స్ట్రెయిన్ .. కర్ణాటకలో తొలికేసు నమోదు

చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాల్లో 18 నెలలకు పైగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఈ వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఇప్పటికే..

South African COVID-19 Strain : భారత్‌లో అడుగు పెట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన కొత్త స్ట్రెయిన్ .. కర్ణాటకలో తొలికేసు నమోదు
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2021 | 4:26 PM

South African COVID-19 Strain : చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాల్లో 18 నెలలకు పైగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఈ వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఇప్పటికే యుకె లో స్టెయిన్ ఓ రేంజ్ లో భయపెడుతుంటే.. నేను మాత్రం తక్కువా అంటూ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త స్ట్రెయిన్‌ కలవరపెడుతూనే ఉంది. ఈ ప్రమాదకరమైన వైరస్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి రాగా తాజాగా కర్ణాటకలో అడుగు పెట్టినల్టు గుర్తించారు.

బెంగళూరు లో దక్షిణాఫ్రికాకు చెందిన కొత్త స్ట్రెయిన్ తోలి కేసు నమోదైంది.  శివమొగ్గ జిల్లాకు చెందిన వ్యక్తిలో  దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ లక్షణాలను ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  ఆ వ్యక్తి ఇటీవలే బ్రిటన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.   కోవిడ్ నిబంధనలను అనుసరించి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ప్రయాణికులు యధావిధిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.  ఆ పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వైద్య సిబ్బందికి అనుమానం రావడంతో మరింత లోతుగా పరీక్షలను నిర్వహించి అతనికి వైరస్ జెనెటిక్ సీక్వెన్స్‌ ఆధారంగా అతనికి సోకింది దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. వెంటనే అతనిని క్వారంటైన్ కు తరలించి చికిత్సనందించారు.  అయితే ఇప్పుడు అతని పరిష్టితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

దక్షిణాఫ్రికా వేరియంట్‌ను గత ఏడాది డిసెంబర్‌లో గుర్తించిన సంగతి విదితమే.. అయితే కర్ణాటకలో ఇప్పటికే యుకె కి చెందిన స్ట్రెయిన్ వైరస్ కేసులు 26నమోదయ్యాయి. తాజాగా దక్షిణాఫ్రికా వేరియంట్ కూడా నమోదు కావడంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలు మొదలు పెట్టింది.

ఓ వైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కొనసాగుతూ ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర, కేరళను వణికిస్తున్న కరోనా ఇప్పుడు కర్నాటకను భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా 84 శాతం కోవిడ్ కేసులు ఈ రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ రోజు రోజుకీ కరోనా నమోదు సంఖ్య పెరుగుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇక నాగ్ పూర్ లో కరోనావైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడంతో మార్చి 15 నుండి మార్చి 21 వరకు పూర్తి లాక్ డౌన్ విధించబడింది. లాక్ డౌన్ సమయంలో కూరగాయలు, పండ్లు మరియు పాల దుకాణాల వంటి ముఖ్యమైన సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Also Read:

మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ స్టేడియంలో పెద్దయెత్తున శివరాత్రి పూజలు, హాజరైన ఏపీ సీఎం జగన్‌

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం.. మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం