White snake Appeared: మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం

  మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మునిసిపాలిటీ పరిధిలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది. మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేత నాగు భక్తులకు దర్శనం ఇచ్చింది.

White snake Appeared: మహాశివరాత్రి వేళ మహా అద్భుతం... మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం
శివరాత్రి రోజున శ్వేతనాగు దర్శనం

Swetha naagu :  మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మునిసిపాలిటీ పరిధిలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది. మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేత నాగు భక్తులకు దర్శనం ఇచ్చింది. కోర్టు ఆవరణంలో పసుపునుటి సంతోష్ అనే వ్యక్తి ఇంటి పరిధిలో శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. శ్వేతనాగును చూసిన కాలనీ వాసులు మంత్రముగ్దులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు, గుడ్లు సమర్పించారు. తెల్లటి వర్ణంతో ఉన్న ఆ పాము…పడగవిప్పి భక్తులను ఆశ్వీరదించినట్లుగా ప్రత్యక్షమైంది. ఆ సమయంలో శ్వేత నాగు భక్తులు పోసిన పాలు తాగడం, భక్తులకు ఎలాంటి హాని చేయకపోవడం విశేషం. మహా శివరాత్రి పర్వదినాన శ్వేత నాగు దర్శనం ఇవ్వడంతో తమ జన్మ ధన్యమైందని క్లబ్ , కోర్టు రోడ్ కాలనీ వాసులు తెలిపారు. ఈ వార్త ఆ నోట ఈ నోట ఊరంతా పాకడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శ్వేత నాగును దర్శించుకున్నారు.

మరోవైపు శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట.. ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

 

Also Read: కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన.. మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు

Photo Gallery: 17 ఏళ్లుగా భార్య శవం పక్కనే.. ఆమె ఎముకలు కుళ్లిపోకుండా వినూత్న ఆలోచన

టైర్లు లేని ట్రాక్టర్‌.. భలేగుంది కదా..! దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి..

Click on your DTH Provider to Add TV9 Telugu