AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colourful Shivling : ఈ శివాలయంలో అన్ని సైన్స్ కు అందని మిస్టరీలే.. ఓ వైపుకు కదులుతూ.. రోజుకు 3 రంగులు మార్చే శివలింగం

భారత దేశం ప్రకృతి సోయగాలతో పాటు.. అనేక అద్భుతాలకు నెలవు. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో దేవాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక శివుడి కొలువైన ఆలయాలకు మనదేశంలో కొదవే లేదు...

Colourful Shivling : ఈ శివాలయంలో అన్ని సైన్స్ కు అందని మిస్టరీలే.. ఓ వైపుకు కదులుతూ.. రోజుకు  3 రంగులు మార్చే శివలింగం
Surya Kala
|

Updated on: Mar 11, 2021 | 3:53 PM

Share

Colourful Shivling : భారత దేశం ప్రకృతి సోయగాలతో పాటు.. అనేక అద్భుతాలకు నెలవు. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో దేవాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక శివుడి కొలువైన ఆలయాలకు మనదేశంలో కొదవే లేదు.. చాలా శివాలయాలు సైన్స్ కు అంతు చిక్కని రహస్యాలను తనలో దాచుకున్నాయి. అలాంటి ఓ ఆలయం రాజస్థాన్‌లో ఉంది.

రాజస్థాన్ లోని దౌలతాపూర్ లో అచలేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఇక్కడి ఆలయంలోని శివలింగం రోజుకు మూడుసార్లు రంగులు మారుతుంది. ఉదయం వేళ ఒకలా, మధ్యాహ్నం మరోలా, రాత్రి ఇంకో రంగులో కనిపిస్తుంది. ఈ శివలింగం ఎలా వచ్చిందో, ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు. స్వయంభువుగా వెలిసినట్లు స్థానికుల కథనం. సూర్యుడు ఉదయించిన తర్వాత శివలింగం ఎరుపు రంగులోకి మారుతుంది. మధ్యాహ్నం కాగానే కాషాయరంగులోకి మారిపోతుంది. ఇక రాత్రివేళ నలుపు రంగులోకి మారిపోతుంది.

ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ శివలింగం పక్కకు కదులుతుంటుంది. అయితే శివలింగం రంగుల మారడానికి గల కారణాలను కనుకునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం సాధించలేకపోయారు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.  ఆలయం లోపల సగం గుడ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలుగా చెబుతుంటారు. ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది. ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఇక ఈ ఆలయంలో నంది మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిని పంచలోహాలతో తయారుచేశారు.

ఈ ఆలయం 2,500 ఏళ్ల నాటిదిగా చెబుతున్నారు. స్థానికుల ప్రకారం ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం. ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. శివయ్యను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

Also Read:

పాకిస్తాన్‌పై కోహ్లీ చేసిన రికార్డుకు బ్రేక్ పడింది.. పరుగుల వరద పారించిన షా..

బ్రాండ్‌ అంబాసిడర్‌పై స్పందించిన దేత్తడి హారిక.. ఇంతకీ తనేం చెప్పిందంటే..