Vijay Hazare Trophy: పాకిస్తాన్‌పై కోహ్లీ చేసిన రికార్డుకు బ్రేక్ పడింది.. పరుగుల వరద పారించిన షా..
విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారుతోంది. సిక్సర్ల వర్షం కురుస్తోంది. తాజాగా ముంబై కెప్టెన్ పృథ్వీ షా మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో..
Prithvi Shaw Continues Golden Run: విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారుతోంది. సిక్సర్ల వర్షం కురుస్తోంది. తాజాగా ముంబై కెప్టెన్ పృథ్వీ షా మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్‌లో, ఆసీస్ గడ్డపై విఫలమైన ఈ కుర్రాడు.. విజయ్ హజారే ట్రోఫీలో శతకాల మీద శతకాలు బాదేస్తున్నాడు.
కర్నాటకతో జరిగిన సెమీ ఫైనల్లో మ్యాచ్‌లో కేవలం 79 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీతో ఇప్పటివరకు 754 పరుగులు చేసిన పృథ్వీ.. టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.122 బంతులాడిన పృథ్వీ.. 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు ముంబై 49.2 ఓవర్లలో 322 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌లుగా ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఈ ఓపెనర్.. ఓ ద్విశతకంతో పాటు రెండు భారీ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
ఇక లిస్టు-ఏ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పిన పృథ్వీ.. ధోనీ, కోహ్లీలను అధిగమించాడు. ఇటీవల సౌరాష్ట్రపై కేవలం 123 బంతుల్లోనే 185 పరుగులు చేయడం ద్వారా పృథ్వీ ఈ ఫీట్‌ను సాధించాడు. 2005లో జైపూర్ వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో ధోనీ 183 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా 2012లో పాకిస్తాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు.
A win for Uttar Pradesh! ??
The Karan Sharma-led unit beat Delhi by 46 runs in the @Paytm #VijayHazareTrophy #QF3 & seal a place in the semifinals. ?? #UPvDEL
Scorecard ? https://t.co/CeQ0BWMhTm pic.twitter.com/mXZlktauZ8
— BCCI Domestic (@BCCIdomestic) March 9, 2021