- Telugu News Photo Gallery Sports photos Jasprit bumrah to marry to be part sports presenter sanjana ganesan cricketers who married sports anchors
జస్‌ప్రీత్ బుమ్రా కంటే ముందు.. యాంకర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు… ఎవరో తెలుసా.. అయితే చూడండి..!
Cricketers Married TV Anchors: స్పోర్ట్స్ యాంకర్లను వివాహం చేసుకున్నవారు క్రికెట్ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా కంటే ముందు చాలా మంది క్రికెటర్లు స్పోర్ట్స్ ప్రెజెంటర్లను పెళ్లి చేసుకున్నారు.. వారు ఎవరో ఓ సారి చూద్దాం...
Updated on: Mar 10, 2021 | 8:01 PM

మీడియా కథనాల ప్రకారం జస్‌ప్రీత్ బుమ్రా స్పోర్ట్స్ ఛానల్ ప్రెజెంటర్ సంజన గణేశన్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. స్పోర్ట్స్ ప్రెజెంటర్‌ను క్రికెట్ క్రీడాకారుడు పెళ్లి చేసుకోబోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి కాదు. ఇలా చాలా మంది క్రికెట్ ఆటగాళ్లు పెళ్లి చేసుకున్నారు.

భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ దేశంలోని స్టార్ స్పోర్ట్స్ యాంకర్లలో ఒకరైన మాయంతి లాంగర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 2012 సంవత్సరంలో వివాహం జరిగింది. బిన్నీ అంతర్జాతీయంగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు..కాని అతని భార్య మాయంతి చాలా కాలంగా స్టార్ స్పోర్ట్స్‌తో యాంకర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మాయంతి తల్లి కావడంతో విరామంలో ఉన్నారు.

దక్షిణాఫ్రికా క్రికెటర్ మోర్న్ మెర్కెల్ చాలా కాలంగా ఛానల్ 9 యొక్క స్పోర్ట్స్ యాంకర్ రోజ్ కెల్లీతో డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ 2015 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటి వీరికి ఓ కుమారుడు.

న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్ 2014లో లారా మెక్‌గోల్డెరిక్‌ను వివాహం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌లో లారా స్టార్ యాంకర్ ఉన్నారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ మాత్రమే కాకుండా లారా రేడియో హోస్ట్ కూడా పనిచేస్తున్నారు. అలాగే ఆమె న్యూజిలాండ్ స్కై స్పోర్ట్స్ క్రీడాకారిణిగా ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు... ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కూడా స్పోర్ట్స్ ప్రెజెంటర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వాట్సన్ భార్య లీ ఫుర్లాంగ్ ఫేమస్ యాంకర్. అయితే వాట్సన్ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడంతో ఆమె ఇప్పుడు బిజినెస్ చూసుకుంటున్నారు. 2010 లో లీని వాట్సన్ వివాహం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ సీన్ మార్ష్ చానెల్ సావెన్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ రెబెకా ఓ డోనోవన్‌ను 2015 లో వివాహం చేసుకున్నాడు. రెబెక్కా మాజీ మిస్ యూనివర్స్ మాత్రమే కాదు చాలా కాలంగా ప్రెజెంటర్‌గా క్రికెట్ టోర్నమెంట్లను కవర్ చేశారు.





























