టోక్యో ఒలింపిక్స్‌లో విదేశీ క్రీడాభిమానులకు నో ఎంట్రీ.. కీలక నిర్ణయం తీసుకోనున్న జపాన్ సర్కార్

టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో విదేశీ ఆటగాళ్లకు అనుమతించకూడదని జపాన్‌ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోవిడ్  కట్టడిలో భాగంగా విదేశీ క్రీడాభిమానులను.. రానివ్వకూడదని...

టోక్యో ఒలింపిక్స్‌లో విదేశీ క్రీడాభిమానులకు నో ఎంట్రీ.. కీలక నిర్ణయం తీసుకోనున్న జపాన్ సర్కార్
Tokyo Olympics 2021
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 09, 2021 | 10:43 PM

Tokyo Olympics 2021: టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో విదేశీ ఆటగాళ్లకు అనుమతించకూడదని జపాన్‌ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోవిడ్  కట్టడిలో భాగంగా విదేశీ క్రీడాభిమానులను.. రానివ్వకూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జపాన్‌ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో చర్చించి ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు వచ్చే విదేశీ క్రీడాభిమానులతో జపాన్‌లో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. భారీ సంఖ్యలో విదేశీయులు జపాన్‌కు పోటెత్తితే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని.. జపాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒలింపిక్‌క్రీడలకు విదేశీయులను అనుమతించరాదనే నిర్ణయానికి జపాన్‌ వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మార్చి 3వ తేదినే టోక్యో మెట్రోపాలిటిన్‌ ప్రభుత్వం అంతర్జాతీయ పారా ఒలింపిక్‌ కమిటీతో సమావేశమై.. నెలఖారులోగా విదేశీ ప్రేక్షకులపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించాయి.

ఇవి కూడా చదవండి..

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా.. AP Municipal Elections 2021: ఏపీ మున్సిపోల్స్‌లో ఆఖరి ఘట్టం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం.. 1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, పాకిస్తాన్‌ ‘వంటగది’లో ద్రవ్యోల్బణం సెగ…