AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Municipal Elections 2021: ఏపీ మున్సిపోల్స్‌లో ఆఖరి ఘట్టం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

AP Municipal Elections: పోటీపోటీ ప్రచారాలు ముగిశాయి... పంపకాలు పూర్తయ్యాయి... ఇప్పుడు పోలింగ్... ఇన్నాళ్లు నేతలు చెప్పిన హామీలు, మాటలు విన్న ఓటర్లు... తమ వంతుగా ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ఎవరి భవిష్యత్ ఏంటో...

AP Municipal Elections 2021: ఏపీ మున్సిపోల్స్‌లో ఆఖరి ఘట్టం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
AP Municipal Elections 2021
Sanjay Kasula
|

Updated on: Mar 09, 2021 | 7:55 PM

Share

AP Municipal Elections Voting: పోటీపోటీ ప్రచారాలు ముగిశాయి… పంపకాలు పూర్తయ్యాయి… ఇప్పుడు పోలింగ్… ఇన్నాళ్లు నేతలు చెప్పిన హామీలు, మాటలు విన్న ఓటర్లు… తమ వంతుగా ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ఎవరి భవిష్యత్ ఏంటో తేల్చేయడానికి వాళ్లూ సిద్ధమయ్యారు. నేతల తరల రాతను బ్యాలెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తం చేయనున్నారు.

నువ్వా నేనా.. అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. బుధవారం పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గెలుపుపై ఎవరి ధీమా వారిది… ఓటర్ల ప్రసన్నం కోసం చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12 మున్సిపల్ కార్పరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 4 ఏకగ్రీవం అయ్యాయి.

14వ తేదీ ఉదయం 8 గంటల కౌంటింగ్‌

పోలింగ్ జరుగనున్న మున్సిపాల్టీల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మాస్క్‌ తప్పనిసరి. బ్యాలెట్‌ పద్ధతినే ఈ ఎన్నిక జరుగుతుంది. 14వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలవుతుంది.

మరోవైపు ఏలూరు, చిలకలూరిపేట కార్పొరేషన్‌ ఎన్నికను హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పోలింగ్‌ నిర్వహించొచ్చని తేల్చేసింది. ఫలితాలను మాత్రం ప్రకటించొద్దని ఆదేశించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో… ఈ రెండు ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవండపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. దాంతో ఎన్నికలు ఆపేయాలని ఆదేశించింది. ఆ తీర్పుపై లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మున్సిపల్‌ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. జోనల్ అధికారులు, పర్యవేక్షణ టీంలకు మెజిస్టీరియల్ అధికారాలు ఇచ్చామన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు ఎన్నికలను పర్యవేక్షిస్తారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించారు. పంచాయితీ ఎన్నికలకు సహకరించినట్లు, మునిసిపల్ ఎన్నికలకు కూడా సహకరించాలని ప్రజలకు రమేష్ విజ్ఞప్తి చేశారు. అంతా స్వచ్ఛందంగా వచ్చి స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారాయన.

మెజార్టీ స్థానాలు కైవశం చేసుకోవాలని అధికార ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో కసరత్తు చేశాయి. మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తే…. టీడీపీ ఇతర పార్టీలు కూడా అదే స్థాయి ప్రచారంతో పోటీని తీవ్రం చేశారు. విజయంపై ఎవరి ధీమా వాళ్లకే ఉన్నా… ఓటర్లు ఎటు మొగ్గుతారో అన్న టెన్షన్‌ కూడా అన్ని పార్టీల్లో కనిపిస్తుంది.

మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒకెత్తు… విజయవాడ, గుంటూరు, విశాఖ ఒకెత్తు అన్నట్టు టీడీపీ, వైసీపీ ప్రచారం చేశాయి. విశాఖపై ఉక్కుసెగ, కార్యనిర్వహక రాజధాని ప్రభావం ఉండగా… విజయవాడ, గుంటూరుపై అమరావతి ఎఫెక్ట్ ఉంది. దీంతో విజయం ఎవరి పక్షం ఉంటుందన్న చర్చ సాగుతోంది. అందుకే ఈ మూడు కార్పొరేషన్లపై పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి.

ఇవి కూడా చదవండి

Viagra of Himalayas: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ‘పురుగు’ శిలీంధ్రం..హిమాలయన్ వయాగ్రాగా పిలిచే దీని ధర ఎంతో తెలుసా..!

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..