AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Accident in prakasam district: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోలని త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే..

Road Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Shaik Madar Saheb
|

Updated on: Mar 09, 2021 | 6:33 PM

Share

Accident in prakasam district: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోలని త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటురు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో మంగళవారం శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న ఇన్నోవా కారు త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్ వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. ఇన్నోవా డోర్లు ఎంతసేపటికీ రాకపోవడంతో కట్ చేసి బయటకు తీశారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

మృతులు గుంటూరు కృష్ణదేవరాయనగర్‌కు చెందిన సురేష్, రంగారావు, మధుకర్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులకు పేర్కొన్నారు. కారు వేగం వల్లనే ఇంతపెద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Eluru Municipal Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ..

SVVU Recruitment 2021: ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వేతనం రూ.17,500

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!