Eluru Municipal Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ..
AP High Court: ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై...
AP High Court: ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలను నిర్వహించాలంటూ మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఎన్నికలను జరిపి ఫలితాలను మాత్రం వెల్లడించవద్దంటూ ధర్మాసనం ఎన్నికల సంఘాని సూచించింది. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉతర్వులు జారీ చేసింది. నిన్న ఎన్నికలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు తాజాగా.. ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా.. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశంపై 40పైగా పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిన్నింటిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఈ విధంగా తీర్పునిచ్చింది.
Also Read: