Posani Krishna Murali: ఎన్టీఆర్‌ని అనాథలా చూడలేదా..? చంద్రబాబు వ్యవహారశైలి ఇదే అంటూ పోసాని తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ రంగంలోకి దిగుతున్నారు. అధికార వైసీపీ తరుఫున ప్రచారం చేస్తూ..
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ రంగంలోకి దిగుతున్నారు. అధికార వైసీపీ తరుఫున ప్రచారం చేస్తూ.. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. కాగా ఆయనకు ముఖ్యమంత్రి జగన్ చాలాసార్లు పదవులు ఆఫర్ చేసినప్పటికీ.. సున్నితంగా తిరస్కరిస్తున్నారు. తాజాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పోసాని కృష్ణమురళి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. తాజాగా ఓ సమావేశంలో బాబు అవసరం ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా ప్రవర్తిస్తారని విమర్శించారు.
2014లో జరిగిన ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్‌ను నెత్తిన పెట్టుకుని కీర్తించిన చంద్రబాబు.. ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో దూరంగా జరగడంతో… తన అనుచరగణంతో తిట్టించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును పొగిడితేనే అక్కడ స్థానం ఉంటుందని.. లేదంటే కథ వేరుగా ఉంటుందని పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తాతలా మంచి వాగ్ధాటితో పాటు ఇమేజ్ ఉన్న వ్యక్తి అవ్వడంతో గతంలో చంద్రబాబు 2009 ఎన్నికల్లో ప్రచారం కోసం వినియోగించుకున్నారని.. ఆ తర్వాత కూరలో కర్వేపాకు తీసినట్లు తీసిపారేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉండటంతో అతనివైపు ఆశగా చూస్తున్నారని విమర్శించారు. తారక్ అనాథగా ఉండి.. ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్లారని పోసాని ప్రశ్నించారు. ఇప్పుడు స్టార్ హీరో కాబట్టి వెంటపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తన్న పోసాని.. అతడు మళ్లీ చంద్రబాబు పంచన చేరడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
కాగా రాజకీయ పరమైన ఏ అంశమైనా సరే.. చంద్రబాబుపై ఒంటికాలిపై ధ్వజమెత్తుతారు పోసాని. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ తరుఫున ప్రచారం చేయడంతో పాటు.. వరస ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నైజాన్ని విమర్శించారు. అప్పట్లో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మనసులో ఏదీ పెట్టుకోకుండా.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారాని పోసానికి పేరుంది.
Also Read:
దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు
స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా