AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dethadi Harika: దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ హారికను  సోమవారం నియమించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త జారీ చేశారు.

Dethadi Harika: దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌‌ హారిక వివరాలు తొలగింపు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 10, 2021 | 6:43 AM

Share

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ హారికను  సోమవారం నియమించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త జారీ చేశారు. అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం హారికకు అందజేశారు.  మహిళా దినోత్సవం సందర్భంగా హారికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది.  మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అలేఖ్యకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్‌లో ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి.

యూట్యూబ్‌లో తన ప్రోగ్రామ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన హారిక.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే హారిక బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టంట్‌లలో ఒకరుగా నిలిచి.. స్ట్రాంగ్ విమెన్‌గా సత్తా చాటింది. సీజన్ విన్నర్ అభిజిత్‌తో హారికకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కాగా, హారికకు యూట్యూబ్‌లో 1.60 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఆమె యాస, భాష పక్కా తెలంగాణ స్టైల్లో ఉంటాయి.  ఇదిలాఉంటే.. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియామకం అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ప్రస్తుతం తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్‌సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది.

Also Read: బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్‏కు కరోనా పాజిటివ్.. కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు..

 ‘సామజవరగమన’ గాయకుడు సిద్ శ్రీరామ్‏కు అవమానం.. ఒంటిపై మద్యం, వాటర్ పోసి..

ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…

Follow Us
చంటి సినిమాకు వెంకటేష్‌ను తీసుకోవడంతో ఆ హీరో బాదపడ్డారా..
చంటి సినిమాకు వెంకటేష్‌ను తీసుకోవడంతో ఆ హీరో బాదపడ్డారా..
బుధాదిత్య యోగంతో ఈ 4 రాశులకు మహర్దశ? నవంబర్ 4 నుంచి ఏం జరగనుంది?
బుధాదిత్య యోగంతో ఈ 4 రాశులకు మహర్దశ? నవంబర్ 4 నుంచి ఏం జరగనుంది?
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
ఎంజీబీఎస్, జేబీఎస్ కాదు.. హైదరాబాద్‌లో మరో 4 భారీ బస్టాండ్లు
ఎంజీబీఎస్, జేబీఎస్ కాదు.. హైదరాబాద్‌లో మరో 4 భారీ బస్టాండ్లు
సిరీస్ గెలిచిన టీమిండియా.. నాలుగో మ్యాచ్‌లో ఊహించని మార్పులు ?
సిరీస్ గెలిచిన టీమిండియా.. నాలుగో మ్యాచ్‌లో ఊహించని మార్పులు ?
జడ్పీటీసీ అభ్యర్థినికి రూ.172 కోట్ల ఆస్తి
జడ్పీటీసీ అభ్యర్థినికి రూ.172 కోట్ల ఆస్తి
ఇల్లు కట్టేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..భారీ నష్టం తప్పదు
ఇల్లు కట్టేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..భారీ నష్టం తప్పదు
విద్యుత్తు తీగలు పదేపదే ట్రిప్‌ అవుతున్నాయి.. ఏంటా అని వెతగ్గా..
విద్యుత్తు తీగలు పదేపదే ట్రిప్‌ అవుతున్నాయి.. ఏంటా అని వెతగ్గా..
చరిత్ర సృష్టించేందుకు అర్ష్‌దీప్ సింగ్ రెడీ
చరిత్ర సృష్టించేందుకు అర్ష్‌దీప్ సింగ్ రెడీ
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..