Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…

పెళ్లి అంటేనే ఓ పెద్ద పండగ. అదో సంబరం. చాలా మంది ఇళ్లల్లో పెళ్లి వేడుకలు మామూలుగా ఉండవు..పెళ్లి అనగానే...కొన్ని రోజుల ముందు నుంచే కోలాహాలం మొదలవుతుంది.

Hyderabad: ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే  షాకవుతారు...
పెళ్లికి కొద్ది నిమిషాల ముందు వరుడు ఎస్కేప్
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Mar 09, 2021 | 5:44 PM

పెళ్లి అంటేనే ఓ పెద్ద పండగ. అదో సంబరం. చాలా మంది ఇళ్లల్లో పెళ్లి వేడుకలు మామూలుగా ఉండవు..పెళ్లి అనగానే…కొన్ని రోజుల ముందు నుంచే కోలాహాలం మొదలవుతుంది. లగ్న పత్రికలు కొట్టించినప్పటి నుంచి హడావిడి షురూ అవుతుంది. ఇక పెళ్లికి కొన్ని రోజుల ముందే చుట్టాలు, బంధవులతో పెళ్లింటికి చేరకుంటారు. లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన ఈ వేడుకను జీవితాంతం గుర్తుంచుకోవాలని అందరూ ఆరాటపడతారు. అందుకు తగ్గట్లుగానే తగినంత డబ్బు లేకపోయినా.. అప్పుతెచ్చి మరీ ఎక్కడా తక్కువ కానియ్యరు. ఇంత కష్టపడి పెళ్లి పనులు చేసి తీరా సమయానికి పెళ్లి ఆగిపోతే.? అది ఎంతటి భాదను కలిగిస్తోంది..? అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది.

పెళ్లికి అంతా సిద్ధమైంది. బంధువులు, చుట్టాలతో ఇళ్లంతా కళకళలాడుతోంది. పెళ్లి కుమార్తె సిగ్గుమొగ్గలు వేస్తుంది. పెద్దలు పనుల్లో బిజీ అయిపోయారు. భోజనాల ఏర్పాట్లు చూస్తున్నారు ముహూర్తం సమయానికి పెళ్లికొడుకు కనిపించకుండా పోయాడు. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఏం జరిగిందో అక్కడున్న వారేవ్వరికీ అర్థం కాలేదు..తీరా తేరుకుని ఆరా తీయగా, కొంత సమాచారం అయితే ఆడపెళ్లి వారి చెవిన పడింది.

అధిక కట్నం ఇవ్వలేదనే వరుడు పెళ్లి పీటల నుంచి వెళ్లిపోయాడని పెళ్లి కూతురు తరుపున వాళ్లకి తెలిసింది. దీంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లికొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. వారి తరపు బంధువుల్ని సైతం విచారిస్తున్నారు.

నిజంగా ఇది దారుణ విషయం.. అంతమంది బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లి ఆగిపోతే ఆ అమ్మాయికి ఎంత చిన్నతనంగా ఉంటుంది. వరకట్నం తీసుకోకూడదని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంది. ఇటువంటి ఘటనలు చూస్తుంటే జనాల్ని మరింత ఎడ్యుకేట్ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. కఠినమైన చట్టాలు తీసుకొస్తే తప్ప మార్పు రాదేమో!

Also Read:  దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు

స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా

దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు