Five Rupees Coins: 5, 10 రూపాయల కాయిన్స్ ఇవ్వండి.. లక్షలు తీసుకెళ్లండి.. హైదరాబాద్‌లో ఏం జరిగిందంటే..!
Five Rupees Coins: మీ వద్ద పాత నోట్లు ఉన్నాయా? అయితే మీరు కోటీశ్వరులు అయినట్లే, మీ వద్ద పాత ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయా? అయితే
Five Rupees Coins: మీ వద్ద పాత నోట్లు ఉన్నాయా? అయితే మీరు కోటీశ్వరులు అయినట్లే, మీ వద్ద పాత ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయా? అయితే మీరు శ్రీమంతులు అయినట్లే, ఇలాంటి వార్తలు ఎన్నో చూసి ఉంటాం కదా. అయితే, కొందరు ప్రజలు వీటిని అమాయకంగా నమ్మి అడ్డంగా మోసపోతుంటారు. అలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి కూడా. తాజాగా ఇలాంటి ఘటనే భాగ్యనగరంలో వెలుగు చూసింది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. పాత కరెన్సీ నాణెలు ఇస్తే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ నమ్మబలికి అందినకాడికి దోచుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కరెన్సీ నాణేలు, నోట్లను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తామంటూ నగర వాసికి ఫోన్ సందేశం వచ్చింది. నాణెనాకి దేవతా మూర్తుల బొమ్మలు ఉన్నట్లయితే, లక్షల్లో సొమ్ము ఇస్తామని ఆ సందేశంలో పేర్కొన్నారు. రూ.5 కాయిన్ ఉంటే రూ. 5 లక్షలు, రూ.10 కాయిన్ ఉంటే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఆశలు రేపారు. ఆ సందేశాన్ని గుడ్డిగా నమ్మిన నగర వాసి.. తన వద్ద 5 రూపాయల నాణేలు నాలుగు ఉన్నాయని వారికి రిప్లై ఇచ్చాడు. ఇంకేముందు సైబర్ నేరగాళ్ల వలలో బాధితుడు అడ్డంగా బుక్కయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుని అతన్ని అడ్డంగా ముంచేశారు. మేము మీకు నగదు బదిలీ చేయడానికి ముందుగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు. అది నమ్మిన నగరవాసి రూ.39 వేలు చెల్లించాడు. కొంత సమయం వేచి చూశాడు. అటు నుంచి ఎలాంటి రిప్లయ్ లేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని వారికి వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!