India-China: భారత్‌- చైనా దేశాల మధ్య శాంతిపర్వం నెలకొంటుందా..? ఇరు దేశాల మధ్య చర్చలకు ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుంది..?

India-China: భారత్‌ - చైనా సరిహద్దుల్లో వివాదం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ..

  • Subhash Goud
  • Publish Date - 5:28 pm, Tue, 9 March 21
India-China: భారత్‌- చైనా దేశాల మధ్య శాంతిపర్వం నెలకొంటుందా..? ఇరు దేశాల మధ్య చర్చలకు ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుంది..?

India-China: భారత్‌ – చైనా సరిహద్దుల్లో వివాదం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే 1964, 2020 విషాదకర సంవత్సరాలుగా మిగిలిపోతాయి. 1964లో చైనా నేరుగా భారత్‌పై దండెత్తగా గత ఏడాది దాదాపు అలాంటి పనే చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో గత ఏడాది మే 5న చైనా సైనికుల దూకుడు వల్ల భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. అదే సమయంలో చైనాకు చెందిన 45 మంది సైనికుల వరకు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంత మంది మరణించినట్లు చైనా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కేవలం నలుగురు మాత్రమే తమ సైనికులు మరణించినట్లు ఇటీవల ప్రకటించింది. అయితే గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది వరకు సైనికులు మృతి చెందినట్లు ఇటీవల రష్యా వార్త పత్రిక ప్రకటించింది. ఇదే సమయంలో బీజింగ్‌కు భారీ నష్టం వాటిల్లింది. చైనా నేటికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ముఖ్యంగా గత సంవత్సరం జూన్‌ నుంచి గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉభయ దేశాల భారీ సైనికులు మోహరించడం వల్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ ఘర్షణ జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా.. ఇప్పటికి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య పలుమార్లు చర్చల్లో దళాల ఉపసంహరించాలన్న నిర్ణయం తీసుకున్నా.. ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇరు దేశాల మధ్య చర్చల మేరకు తూర్పు లద్ధాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల నుంచి రెండు దేశాల దళాల ఉపసంహరణ ప్రారంభం అయ్యాయి. దశలవారీగా సమన్వయంతో ఈ కార్యక్రం చేపట్టారు. వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణను పూర్తి చేశారు. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర రేవులోని ఫింగర్‌-8కు తూర్పున చైనా తన బలగాలను ఉంచుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో ప్రకటించారు. అదే సమయంలో భారత్‌ కూడా ఫింగర్‌-3కు సమీపంలో ధన్‌సింగ్‌ థాపా శిబిరం వద్ద తన బలగాలను ఉంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా గత సంవత్సరం తర్వాత పాంగాంగ్‌ వద్ద చేపట్టిన నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తం బలగాల ప్రక్రియ పూర్తయ్యేసరికి కొన్నివారాల సమయం పడుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బలగాల మోహరింపు, గస్తీ తదితర అంశాలపై వివాదాలు లేకపోలేదు.

అయితే ఫిబ్రవరి 10 నుంచి దళాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు చైనా రక్షణ శాఖ సీనియర్‌ కర్నల్‌ వు క్వియాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో మాస్కోలో జరిగిన ఉభయ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం, జనవరి 24 జరిగిన 9వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల ఫలితంగా దళాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు చైనా చైనా స్పష్టం చేసింది. అయితే కీలకమైన ప్రాంతాల నుంచి మాత్రం సైనికులు అప్పుడే తిరిగిరారు. వారు అక్కడే ఉంటారు. సరిహద్దుల్లో ముందు వరుసలో మోహరించిన దళాలు కూడా అక్కడే ఉంటాయి. చివరి దశలో వారు వెనక్కి వస్తారు. పాంగాంగ్‌ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఏకకాలంలో జరుగుతుంది. ఉపసంహరణను ఇరు దేశాల సీనియర్‌ సైనికులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత విషయాన్ని పక్కనబెడితే ఇప్పటికే 1960 నుంచి 43వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆధీనంలో ఉంది. అంతేకాక ఈశాన్య రాష్ట్రమై అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 90 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం తనదిగా చైనా వాదిస్తూ వస్తోంది. అలాగే అసలు యావత్‌ అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌ అని అది తమ ప్రాంతమేనని వాదోపవాదాలు వినిపిస్తోంది.

ఇవి చదవండి :

ఒకే ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థం లేదు.. ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

రూ.13 వేలు తగ్గిన బంగారం

Maoists Targets: పినపాక నియోజకవర్గంలో మావోయిస్టుల కలకలం.. వ్యాపారికి బెదిరింపులు..