వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్
వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ కారణంగా మొబైల్ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. వాట్సాప్‌లో బగ్‌ని గుర్తించినట్లు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ హెచ్చరికలు జారీ చేసింది.
వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు సైతం డేంజర్‌లో ఉన్నారంటూ హెచ్చరికలు చేసింది. డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ను నడుపుతున్న యూజర్లు.. డెస్క్‌టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్ వాడుతున్నట్లయితే ఆయా యూజర్ల సిస్టమ్స్ హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. బగ్ కారణంగా, హ్యాకర్లు మీ డివైజ్‌ను వాట్సాప్ యాప్ సహాయంతో యాక్సెస్ చేసే ఛాన్స్ ఉందని సెర్ట్ తెలిపింది. వాట్సాప్ డెస్క్‌టాప్ అప్లికేషన్ సెక్యూరిటీ పరంగా బలహీనంగా ఉందని పేర్కొంది. ఇది ఫైల్ ఓపెనింగ్ ప్రాసెస్‌కు సంబంధించిందని.. ఎంఐఎంఈ రకం, ఫైల్ ఎక్స్‌టెన్షన్ మధ్య సరిపోలకపోవడం కారణంగా.. వాట్సాప్ కొన్ని అటాచ్‌మెంట్స్‌ని సరిగ్గా గుర్తించలేకపోతుందని.. ఈ టెక్నికల్ వీక్‌నెస్‌ని సద్వినియోగం చేసుకొని హ్యాకర్స్ మీ కంప్యూటర్లలోకి వైరస్‌ను చొప్పించే ప్రమాదం ఉందని ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొప్ప మనసు చాటుకున్న అందాల నటి..!
తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మీ ఫన్ పొదలయ్యేది అప్పటి నుండే
విద్యార్ధుల కోసం ప్రిన్సిపాల్ చేసిన ఈ పనికి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు
వీగన్ డైట్ చేస్తున్నారా.. ఇది మీకోసమే..!
భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

