గొప్ప మనసు చాటుకున్న అందాల నటి..!
హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న ముంబయి మురికివాడల్లోని పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా అందజేశారు. హేమకుంట్ అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన భర్త మథియాస్ బోతో కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి మరీ వాటిని పంపిణీ చేశారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో తక్కువ ఆదాయం, మురికివాడ ప్రాంతాలలో నివసించే కుటుంబాలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో తాప్సీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
శీతలీకరణ ఉపకరణాలు అందజేసి అక్కడి నివాసితులకు ఎండ తాపం నుంచి ఉపశమనం కల్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తాప్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసున్న మనిషి అంటూ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా తాప్సీ … మనం ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలికగా తీసుకుంటాం. కానీ, ఈ భరించలేని వేడిలో ఉన్న వారికి చిన్న గాలి కూడా ఒక వరంలా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగం కావడం తనను చాలా కదిలించిందని, ఇది ఇవ్వడం మాత్రమే కాదు..ప్రజలతో నిలబడటం, వారి బాధను అర్థం చేసుకోవడం… మనకు తోచిన సాయం చేసి దానిని తగ్గించడ అని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మీ ఫన్ పొదలయ్యేది అప్పటి నుండే
విద్యార్ధుల కోసం ప్రిన్సిపాల్ చేసిన ఈ పనికి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు
వీగన్ డైట్ చేస్తున్నారా.. ఇది మీకోసమే..!
భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!
ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్ తెలిస్తే.. గుండె జారుతుంది
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

