విద్యార్ధుల కోసం ప్రిన్సిపాల్ చేసిన ఈ పనికి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు
దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండవేడిమి, వడగాడ్పులు, ఉక్కపోత కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఎండవేడిని తట్టుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది. కూలర్లు.. ఏసీలు ఏర్పాటు చేసుకొని ఉపశమనం పొందుతారు. అయితే, ఢిల్లీలోని ఓ కాలేజి ప్రిన్సిపాల్ ఎండవేడిమి నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు స్వయంగా ఆమె ఏంచేశారో చూస్తే ఆశ్చర్యపోతారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కాలేజ్‌లో.. డాక్టర్ ప్రత్యూష్ వత్సల ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నడివేసవిలో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఆమె వినూత్న చర్యలు తీసుకున్నారు. ఆవుపేడను స్వయంగా క్లాస్ రూమ్ గోడలన్నింటికీ పూశారు. ఇలా చేయడం వల్ల గోడలు వేడిని నిరోధించి చల్లదనాన్ని ఇస్తాయని తెలిపారు. వేసవిలో గదులను కూల్ గా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ విధంగా ఆవుపేడ పూశామని, మరో వారం రోజుల్లో పరిశోధన వివరాలను తెలియజేస్తామని ప్రిన్సిపాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీగన్ డైట్ చేస్తున్నారా.. ఇది మీకోసమే..!
భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!
ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్ తెలిస్తే.. గుండె జారుతుంది
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

