కోనోకార్పస్ ఆకులతో డయాబెటిస్ తగ్గుతుందా? వీడియో
కోనోకార్పస్ ఈ మొక్కలపై మరోసారి వివాదం చెలరేగుతుందట. వృక్షం రక్షిత రక్షిత అంటున్నారు. వృక్షాలను సంరక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయనేది పెద్దల మాట. కానీ కోనోకార్పస్ చెట్లను పెంచితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు కొందరు. పచ్చదనం, అందం కోసం రోడ్ల పక్కన, రోడ్ల మధ్యలో నాటే ఈ మొక్కలను తెలంగాణ, ఏపీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు నిషేధించాయి. అయితే కోనోకార్పస్ మొక్కలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటుంది జనచైతన్య వేదిక.
ప్రకృతిలో ఏది చెడ్డది కాదన్నారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు. అయితే ఏ అవసరం కోసం వాడుతున్నామనేదే ముఖ్యం అన్నారు. ప్రతి దాంట్లోనూ ఎక్కువ ప్రయోజనాలు, ఒకటి రెండు నష్టాలు సాధారణం అన్నారు. కోనోకార్పస్ మొక్కలతోనూ ఎన్నో ప్రయోజనాలు, ఒకటి రెండు మైనస్ ఉన్నాయన్నారు. కోనోకార్పస్ మొక్కలతో ఆస్తమా వస్తుందనే ప్రచారంలో కొంత నిజం ఉన్నా ఇది అన్ని మొక్కలకు వర్తిస్తుందన్నారు. ఏ మొక్క అయినా పొద్దున్న ఆక్సిజన్, రాత్రి కార్బన్ డై ఆక్సైడ్ వదులుతాయని దీనికి కోనోకార్పస్ అతీతం కాదని చెప్పారు. కోనోకార్పస్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు. కోనోకార్పస్ ఆకులను మేకలకు పెడితే పాల ఉత్పత్తి 20% పెరిగినట్లు అధ్యయనాల్లో తేలిందన్నారు. కోనోకార్పస్ ఆకులతో డయాబెటిస్ తగ్గుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు చెప్పారు. ఈ చెట్ల వేర్లు నిర్మాణాలను దెబ్బతీస్తాయనే దానిలో కొంత నిజం ఉన్నా ఇలా నష్టం చేసే చెట్లు ఎన్నో ఉన్నాయన్నారు. కోనోకార్పస్ మొక్కలు ఉండే చోట ఇతర చెట్లను డామినేట్ చేస్తాయని ఎడారిలో అయినా నీళ్లు లేకపోయినా ఇవి బతకగలవన్నారు మోహన్ రావు. దుబాయి చెట్టుగా పేరుగాంచిన ఈ కోనోకార్పస్ మొక్కలను ఎక్కువగా అరబ్ దేశాల్లో పెంచుకునేవారు. ఇది మాంగ్రూ జాతి మొక్క.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

