అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యా యత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ట్రంప్ చెవికి గాయమైంది. అయినా ట్రంప్ వెనుకడుగు వేయలేదు. తన ప్రచారంలో దూసుకెళ్లారు. ఇదిలా ఉంటే తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో ఓ 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు 2025 మార్చిలో అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో తెలిసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆ యువకుడు.. అందుకు డబ్బులు ఇవ్వట్లేదనే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఫెడరల్ వారెంట్‌లో పేర్కొన్నారు.
విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్ మేయర్‌ను తమ ఇంటిలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత 14వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్ ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు హత్య విషయం తెలుసుకొని, కాన్సస్‌లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు తెలిసింది. అంతేకాదు.. అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు అతడు కుట్ర పన్నినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది. వారిని చంపేసిన తర్వాత ఆ యువకుడు ఓ డ్రోన్, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడట. ఓ రష్యా వ్యక్తితో కలిసి ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. టిక్‌టాక్, టెలిగ్రామ్ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో ఇతడు సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్‌ను చంపి ఉక్రెయిన్ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

విభిన్నంగా పెళ్లి పిలుపు - ఆ మాత్రం క్రియేటివిటీ లేకపోతే ఎలా..?

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే

బాంబులు పడతాయని భయం వేసింది వీడియో

కొడుకు చేతికి ఫోన్ ఇస్తే..తల్లికే చుక్కలు చూపెట్టాడుగా వీడియో

మరో కేసులో లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత వీడియో

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో
