ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
ఉరుకుల పరుగు జీవితంలో ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే ఉద్యోగులు ఎందరో. ఆ రోజున చేయాల్సిన పనుల లిస్టును ముందే తయారు చేసుకుంటారు. చాలా మంది ఆదివారం నాడే హెయిర్ కట్ చేయించుకుంటుంటారు. శుక్రవారం, మంగళవారం జుట్టు కత్తిరించుకోకూడదని కొందరు నమ్ముతారు. అందుకే ఆదివారం సెలూన్లకు క్యూ కడతారు. అయితే ఆదివారం రోజు హెయిర్ కట్ చేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదం కాదట. ఉత్తర భారతంలో ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు. దక్షిణాదిన దీన్ని అంతగా పట్టించుకోరు. కానీ, హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం సూర్యభగవానుడికి అంకితం. అందుకే ఆదివారాన్ని భానువారమని కూడా పిలుస్తారు. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, సంపద, గౌరవానికి సంకేతం. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం జుట్టు లేదా గోళ్లు కత్తిరించడం వలన సూర్యుడి సానుకూల ప్రభావం తగ్గుతుందని, తద్వారా ఆరోగ్యం లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయని విశ్వసిస్తారు. జుట్టు కత్తిరించడం వలన సంపద లేదా శక్తి తగ్గిపోతుందని మరికొందరి భావన. జుట్టును శరీరంలోని శక్తి కేంద్రంగా చెబుతారు. అందుకే ఆదివారం హెయిర్ కట్ చేయించకపోవడమే మంచిదంటున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. పుట్టిన రోజులప్పుడు, మంగళ, శుక్రవారాల్లో హెయిర్ కట్ చేయించరు. చాలా మంది శనివారం కూడా హెయిర్ కట్ చేయించరు. అలాగే అమావాస్య, పౌర్ణమి రోజు కూడా జుట్టు కత్తిరించరు. హెయిర్ కట్ మాత్రమే కాదు.. ఆదివారం రోజున ఇంట్లో బూజులు దులిపి శుభ్రం చేయడం లాంటివి చేయకూడదట. వీటి వలన నెగిటివిటీ పెరుగుతుందని చెబుతారు. ఆదివారం రోజు కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించడం శుభకరంకాదట. వాస్తవానికి ఇవన్నీ ఆయా ప్రాంతాల సంస్కృతీ, సంప్రదాయాలను బట్టి విశ్వసిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా ఆదివారం ఈ పనులు చేయకూడదని ఆధారాలు లేవు. ఏదేమైనా సండే రోజు ఎక్కువగా పనులు పెట్టుకోకుండా విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

