వడ్డించే వంటకాలు కూడా శుభలేఖలోనే..అతిథుల్ని ఆపగలమా..వీడియో
పెళ్లికి వెళ్తున్నాం అంటే..మొదటగా అబ్బాయి, అమ్మాయి ఎవరని మాట్లాడుకుంటాం.. ఆ తర్వాత కట్నాలు కానుకలు. కానీ పెళ్లికి వచ్చిన వారు తర్వాత ఇవేవి గుర్తుంచుకోరు పెళ్లిల్లో పెట్టిన భోజనం గురించే మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు మనం పెట్టే భోజనం ఎలా ఉండాలి..మనం పెట్టిన భోజనం బాలేదని..వేస్ట్ చేయకుండా.. తిన్న అందరూ ఆహా అనాలి కదా..ఇక్కడ ఓ వ్యక్తి చేసిన ఆలోచన కూడా అలానే ఉంది..తన కొడుకు రిసెప్షన్‌కు వచ్చే వారు అక్కడ ఏం పెడతారో తెలియక ఫుడ్‌ను వేస్ట్ చేయకూడదని..రిసెప్షన్‌లో పెట్టబోయే భోజనాల గురించి ముందుగానే ఇన్విటేషన్ కార్డులో ప్రింట్ చేయించాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారు ఫుడ్ వేస్ట్ చేయంకుండా తినే లా చూసుకున్నాడు ఏలూరు జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన కోడూరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కుమారుడి వివాహం రిసెప్షన్‌కు వచ్చే అతిథులు సంతృప్తిగా తిని వెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు.
రిసెప్షన్‌లో ఏమేమి వంటకాలు వడ్డిస్తారో ఆహ్వానితులకు ఇచ్చే ఇన్విటేషన్ కార్డులో ముందే ప్రింట్ చేయించాడు. అంతేకాదు వారు పెట్టే విందు భోజనం విశిష్టత కూడా అందులో రాయించారు. రిసెప్షన్‌కు వచ్చే వారు ఫుడ్ నచ్చక వేస్ట్ చేయకుండా ఉండేందుకు..వచ్చిన వారు సంతృప్తిగా తిని వెళ్లేందుకు లక్ష్మినారాయణ ఇలా వినూత్నంగా ఆలోచించారు. మన సాంప్రదాయంలో పెళ్లి కేవలం పురుషుడు, స్త్రీని ఒక్కటిగా చేసే వేదిక మాత్రమే కాదు ఈ సందర్బంగా నిర్వహించే ప్రతి కార్యక్రామానికి తగిన ప్రయోజనం ఉంటుంది. కొందరు పెళ్లి మంత్రాలను, భార్యా భర్తల సంబంధం తెలియచేసే సందేశాలను పెళ్లి కార్డులో వేస్తే.. మరికొందరు విందు భోజనం విశిష్టత ప్రస్తావిస్తారు. ఏదిఏమైనా “వివాహ భోజనంబు వింతైన వంటకంబు …వియ్యాలవారి విందు..ఓహొహ్హొ నాకే ముందు..అంటూ ఘటోత్కచుడిగా మెప్పించిన యస్వీఆర్”… పులిహోర, గారెలు, లడ్డూలు ఇలా ఎన్నో రకాల వంటకాలు ప్రస్తావించారంటే అప్పట్లో వాటిని సాంప్రదాయంగా పెళ్లిలో వడ్డించారనే విషయం మనకు తెలుస్తుంది. ఇక కోడూరి లక్ష్మీనారాయణ విందు భోజనం ఎలా ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈయన గతంలో బీజేపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అధ్యక్షుడుగా పని చేయటంతో రాజకీయ నాయకులు సైతం ఈ విందుకు భారీగా హాజరయినట్టు చెప్పుకుంటున్నారు.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

