AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మీ ఫన్ మొదలయ్యేది అప్పటి నుండే

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మీ ఫన్ మొదలయ్యేది అప్పటి నుండే

Phani CH

|

Updated on: Apr 21, 2025 | 2:58 PM

తెలంగాణలో విద్యార్థులకు సమ్మర్‌ హాలిడేస్‌ రానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు సెలవులు రానే వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎండా కాలం సెలవుల్లో ఎంజాయ్‌ చేయనున్నారు విద్యార్థులు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 2025 వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

విద్యా సంవత్సరం ముగియడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ వేసవి సెలవుల్లో టూర్లు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. తెలంగాణ విద్యా శాఖ జారీ చేసిన విద్యా క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24, 2025 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఇక పాఠశాలలు జూన్ 12, 2025న తిరిగి తెరుచుకుంటాయని తెలిపింది. దీని వలన పాఠశాల విద్యార్థులకు 46 రోజుల వేసవి సెలవులు లభిస్తాయి. విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. కాగా వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 23 లోపు పరీక్షలు పూర్తవ్వనున్న నేపథ్యంలో అదే రోజు పరీక్షా ఫలితాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రకటించింది. మరో వైపు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్ధుల కోసం ప్రిన్సిపాల్‌ చేసిన ఈ పనికి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు

వీగన్‌ డైట్‌ చేస్తున్నారా.. ఇది మీకోసమే..!

భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!

ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్‌ తెలిస్తే.. గుండె జారుతుంది

Naga Chaitanya: చైతూకు ఇంకో తమ్ముడు ఉన్నాడా ??

Published on: Apr 20, 2025 07:55 PM