Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: బంగారం ప్రియులకు శుభవార్త.. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమేనా..? రూ.13 వేలు తగ్గిన బంగారం

Gold Price: మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రేమ. కరోనా మహమ్మారి కారణంగా పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక లావాదేవీలు గత సంవత్సరం ఆగస్టులో దేశీయ మార్కెట్‌లో ఆల్‌టైమ్..

Gold Price: బంగారం ప్రియులకు శుభవార్త.. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమేనా..? రూ.13 వేలు తగ్గిన బంగారం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 09, 2021 | 4:25 PM

Gold Price: మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రేమ. కరోనా మహమ్మారి కారణంగా పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక లావాదేవీలు గత సంవత్సరం ఆగస్టులో దేశీయ మార్కెట్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు ధర నమోదు చేసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.56,310 అత్యంత గరిష్టంగా పలికితే గత వారం రూ.43వేల చేరువలోకి పడిపోయింది. తాజాగా మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,430కి చేరింది. పసిడి ధరల్లో సర్దుబాటుతో అభరణాల కొనుగోలుకు భారీ డిమాండ్‌ పెరుగుతోందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వచ్చే మే నెలలో వివాహాలు, అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అందుకునేందుకు బంగారు అభరణాల షాపులు కొనుగోళ్లు చేపట్టాయి. కానీ బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు డిమాండ్‌ ఇంకా ఊపందుకోలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, డాలర్‌పై రూపాయి మారకం విలువపై కూడా భారత్‌లో బంగారం కొనుగోళ్లకు డిమాండ్‌ ఉన్న విషయం తెలిసిందే. వివిధ దేశాల్లో ఆర్థిక లావాదేవీల ప్రక్రియ ప్రస్తుతం పుంజుకుంటోంది. దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. ఆర్థిక వ్యవస్‌థపై నెలకొన్న అనిశ్చిత క్రమంగా తొలగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధర కనిష్ట స్థాయికి పడిపోయి మళ్లీ ఆల్‌టైమ్‌ రికార్డు నెలకోల్పుతుందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీలు, తక్కువ క్వాలిటీ గల కార్పొరేట్‌ బాండ్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. వాటి నుంచి అధిక లాభాలు పొందాలనే కోరుకుంటారు. అందుకే ఇన్వెస్టర్లు బంగారం, ప్రభుత్వ రంగ బాండ్లపై కంటే రిస్క్‌ కార్పొరేట్‌ బాండ్లు ఈక్విటీలపై పెట్టుబడులు పెట్టడానికి ఆపక్తి చూపుతారు. ఇంతకు ముందు యూఎస్‌ డాలర్‌ బలహీనపడినా స్వల్పంగా బంగారం పెరుగుతూ వచ్చింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, కోవిడ్‌-19 వల్ల డాలర్‌ బలహీనపడి 2019,2020 బంగారం పెరగడానికి కారణం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి గత వారం 1.9 లక్షల కోట్ల డాలర్లు ఉద్దీపన పథకం ప్రకటించడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగి, పసిడికి బాగా డిమాండ్‌ అవుతోందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఎక్కువ కాలం బంగారం ధరలు పెరగబోవని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

అయితే గత ఏడాది ఆగస్టు నెలతో పోల్చుకుంటే భారీగానే తగ్గాయి. ఏడు నెలల కిందట బంగారం ధర రూ.58 వేలకు చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,430 ఉంది. దీంతో బంగారం కొనేందుకు ఇది సరైన సమయమని పలువురు భావిస్తున్నారు. అలాగే 2020 ఆగస్టు 8న 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55 వేలు, 2021 మార్చి 8న 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42వేలు ఉంది. ఏడు నెలల్లో దాదాపు 13 వేల రూపాయల వరకు తగ్గింది. ఇక 2020 ఆగస్టు-సెప్టెంబర్‌లలో 10 గ్రాముల బంగారం రూ.58వేలకు వెళ్లింది. ఇప్పుడు రూ.44వేలకు అటుఇటుగా ఉంది. గత సంవత్సరం కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచ దేశాలన్ని పెట్రోల్‌ వాడకం తగ్గింది. ముడి చమురు రేట్లు పూర్తిగా పడిపోయాయి. దీంతో పసిడికి అంతర్జాతీయంగా బాగా గిరాకీ పెరిగింది. ఎల్లో మెటల్‌ కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ పోటీ పడటంతో ధర అనూహ్యంగా పెరిగింది.

ఇవి చదవండి :

National Pension System: కేంద్రం అనుమతి.. మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? మీకో శుభవార్త

PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ

ఒకే ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థం లేదు.. ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు